సోమవారం ఎపిసోడ్ ప్రారంభంలో.. బాబా భాస్కర్, శ్రీముఖిల మధ్య సరదాగా వార్ జరిగింది. బాబా భాస్కర్‌ని ఇమిటేట్ చేస్తూ శ్రీముఖి చాల ఆటపట్టించింది. నన్నే ఇమిటేట్ చేస్తావా? నా ఎక్స్ ప్రెషెన్‌పై ఫస్ట్ టైం నువ్వే కామెంట్ చేస్తున్నావ్ అన్నాడు బాబా.ఇక రాహుల్ రాకతో  పునర్నవి చిందులు వేసింది. బోర్ కొట్టినప్పుడల్లా వాడ్ని (రాహుల్) ఆటపట్టించేదాన్ని అంటూ రాహుల్ కోసం కలలు కంటున్న పునర్నవి.. రాహులా.. రాహులా ఏమైపోయావ్ రా అని కలవరిస్తూ  ఉండగా.. బిగ్ బాస్  రాహుల్ తో మీరు  బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లే టైం వచ్చిందని తెలిపారు.

ఇక నామినేషన్స్ విషయానికి వస్తే  హాట్ సీట్స్ హాట్ హాట్.. 10వ వారం నామినేషన్స్‌లో భాగంగా.. హౌస్‌లో ఉన్న 9 మంది కంటెస్టెంట్స్ నాలుగు జంటలుగా చేసి  మీలో ఎవరో గొప్పో తేల్చుకోవాలని చెప్పరు బిగ్ బాస్.తొలుత  శ్రీముఖి, శివజ్యోతిలు మీరో ఎవరు గొప్పో తేల్చుకోవాలన్నారు. నేను గొప్ప.. నేను బాగా ఆడా అంటే.. నేను బాగా ఆడా అంటూ మొదలైన ఫైటింగ్ ఒకరంటే ఒకరి కోపం వచ్చే వరకూ వెళ్లింది.

ఫైనల్‌గా ఈ ఇద్దరిలో ఇంటి సభ్యులు అందరు కలిసి జ్యోతిని సేవ్ చేశారు.  ఇక  శ్రీముఖి నామినేషన్‌లో ఉంది.తరువాత .. వితికా, రవిక్రిష్ణల మధ్య నామినేషన్స్ వార్ జరిగింది. ఈ ఇద్దరిలో  ఇంటి సభ్యులు నుండి వితికాకే ఎక్కువ ఓట్లు రావడంతో వితికా నామినేషన్స్ నుండి సేవ్ రవి నామినేషన్‌లో నిలిచాడు.3 జోడీగా బిగ్ బాస్ హౌస్ జిగిడీ దోస్త్‌లు రాహుల్, వరుణ్‌ల మధ్య నామినేషన్స్ వార్ జరగ్గా ఈ ఇద్దరూ చాలా కూల్‌గా సాఫీగా చేశారు.

ఒకరికొరకు త్యాగం చేసుకుంటూ ఓటింగ్‌లో పాల్గొన్నారు.  ఇంటి సభ్యుల నుండి ఎక్కువ సపోర్ట్  రాహుల్‌కే లభించడంతో వరుణ్ నామినేషన్‌లో నిలిచాడుచివరి జోడీగా పునర్నవి, బాబా భాస్కర్‌ల మధ్య వార్ జరగ్గా.. ‘మీరు ఎంటర్‌టైన్మెంట్ పక్కన పెట్టి గేమ్ ఆడండి అంటూ పునర్నవి చెప్పింది.బాబా భాస్కర్ గారికి  లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్ల ఆయన నాతో పోల్చుకుంటే సరిగా ఆడటం లేదని పునర్నవి అన్నది. మొత్తానికి ఎట్టకేలకు బాబాను నామినేషన్‌లోకి నెట్టింది.మొత్తానికి ఈ వారంలో మొదటిలో రోజు  నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో పదోవారం నామినేషన్స్‌లో శ్రీముఖి, రవి, బాబా భాస్కర్, వరుణ్ నలుగురూ ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: