‘సైరా’ ఈవెంట్ లో ఒకే సోఫాలో కలిసి కూర్చున్న చిరంజీవి పవన్ చరణ్ ల ఫోటోకు కొన్ని వేల సంఖ్యలో మెగా అభిమానుల నుండి లైకులు వస్తున్నాయి. అదేవిధంగా ‘సైరా’ ఈవెంట్ వేదిక పై చరణ్ పవన్ లు ఒక సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రవర్తించిన తీరు కూడ మెగా అభిమానులకు విపరీతంగా ఆకర్షించింది. 

ఇలాంటి పరిస్థితులలో మెగా అభిమానుల నుండి చరణ్ సెల్ నెంబర్ కు కొన్ని వేల సంఖ్యలో ఒక సూచన వస్తున్నట్లు టాక్. చరణ్ తన తండ్రి చిరంజీవి ఫిలిం రీ ఎంట్రీకి ఎలా శ్రద్ధపెట్టి ‘ఖైదీ నెంబర్ 150’ తీసి తన తండ్రిని మళ్ళీ నిలబెట్టడమే కాకుండా ‘సైరా’ లాంటి భారీ సినిమాను చిరంజీవి కోసం తీసినట్లుగా పవన్ కోసం చరణ్ తానే నిర్మాతగా మారి ఒక సినిమాను శ్రద్ధపెట్టి తీయాలని మెగా అభిమానులు చాలామంది చరణ్ కు మెసేజ్ ల రూపంలో సూచిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఈ అనుకోని అనూహ్య స్పందనకు చరణ్ కూడ షాక్ అవుతున్నట్లు సమాచారం. వాస్తవానికి పవన్ అంగీకరిస్తే అతడితో సినిమాలు తీయడానికి ఎందరో భారీ నిర్మాతలు రెడీగా ఉన్నారు. అయితే మెగా అభిమానులు మాత్రం పవన్ రీ ఎంట్రీ బాధ్యతను ఆ భారీ నిర్మాతలకు అప్పచేప్పకుండా స్వయంగా చరణ్ ఆ బాధ్యతను తీసుకోమని చెప్పడం వెనుక మెగా అభిమానులకు చరణ్ సమర్థత పై ఎంత నమ్మకం ఉందో అర్ధం అవుతుంది.  

దీనికితోడు ‘సైరా’ ఈవెంట్ రోజున చరణ్ పవన్ కళ్యాణ్ ను చిరంజీవి పక్కన నుంచోపెట్టి తాను వెనుక వరుసలోకి వెళ్ళిపోవడం చరణ్ సంస్కారాన్ని సూచిస్తోంది అంటూ మెగా అభిమానులు చరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనితో చరణ్ మాత్రమే పవన్ ను ఒప్పించి ఫిలిం రీ ఎంట్రీకి సిద్ధం చేయగల వ్యక్తి అంటూ చరణ్ కు మెసేజ్ లు పెడుతూ పవన్ రీ ఎంట్రీ బాధ్యతను కూడ చరణ్ కే అప్పచేపుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: