మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రాబోతున్న  ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం  కోసం మెగా ఫ్యాన్స్ తో  పాటు  సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం   ఈ చిత్రాన్ని 285 కోట్ల భారీ బడ్జెట్‌ తో నిర్మించారు.  పైగా ఈ బడ్జెట్ లో మెగాస్టార్ చిరంజీవి పారితోషికం  మినహాయించి..  మెగాస్టార్ కి హోమ్ ప్రొడక్షన్ కాబట్టి, ఆయన లాభాలలో షేర్ ను తీసుకుంటారట.  తెలుగు సినిమాల్లోనే  అతిపెద్ద చిత్రంగా ఈ చిత్రం  రాబోతుంది.  పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా  రాబోతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా  అక్టోబరు 2న  గాంధీ జయంతి సందర్భంగా  ప్రేక్షకుల ముందుకు రానుంది.   లాభాపేక్ష లేకుండా ఈ చిత్రం అత్యున్నతంగా రావడానికి రాజీ పడకుండా ఖర్చు చేశారు.  దర్శకుడి కోరిక మేరకు కోటలు, ప్యాలస్ ల సెట్టింగ్స్ మరియు వార్ ఎపిసోడ్స్ కొరకు భారీగా ఖర్చు చేయడం జరిగింది.  ఐతే జార్జియా దేశంలో ఒక వార్ ఎపిసోడ్ ఒకటిన్నర నెలకు పైగా చిత్రీకరించారట.  దాని కొరకు అక్షరాలా 75కోట్లు ఖర్చు చేశారు. మరి ఆ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తోందేమో చూడాలి.  ఇక ఈ చిత్రం పై మెగా అభిమానుల్లో ఎంతటి భారీ హోప్స్ ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 44 నిముషాలని తెలుస్తోంది.  ఈ రన్ టైమ్ కొద్దిగా ఎక్కువే.  కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఏవీ మిస్ కాకుండా చూపించాలి కాబట్టి ఇంత రన్ టైమ్ అవసరమని భావించారట టీమ్.  ఈ మధ్య ప్రేక్షకులు సైతం సినిమా బాగుంటే 3 గంటల రన్ టైమ్ అయినా పెద్ద విషయం కాదని అంటున్నారు. 


 సో.. సైరాకు రన్ ఇబ్బంది లేదు.  ఇక టీమ్ సైతం సినిమాలో అన్ని రకాల అంశాలు ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇక  హిందీలో  సైరాకి బజ్ రావాలంటే ఇంకా అక్కడ ప్రమోషన్స్ ను వేగవంతం చెయ్యాలి. పైగా  'వార్' మూవీ, సైరాకి హిందీలో పోటీగా రిలీజ్ అవుతుంది. మరి  ఆ పోటీలో నెగ్గాలంటే ప్రమోషన్స్ బలంగా చెయ్యాలి.  ఈ సినిమాలో  సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క  వంటి స్టార్ లు కూడా  నటిస్తున్నారు.  అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా  సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అందుకే  ఖచ్చితంగా  సైరా మరో సౌత్ బ్లాక్ బ్లాస్టర్ అవుతుందని మెగా ఫ్యాన్స్ షోషల్ మీడియాలో వరుసగా కామెంట్లు పెడుతూ.. సైరా సౌత్ బ్లాక్ బ్లాస్టర్ అని ట్రోల్ చేస్తున్నారు.  

    


మరింత సమాచారం తెలుసుకోండి: