చిక్కుల్లో అమితాబ్ బచ్చన్.. ఒక పక్క .దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఇంకో పక్క అమితాబ్ పై సైరా కుటుంభాసభ్యులు హైదరాబాద్ హై కోర్ట్ లో కేస్. వేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు ,గత కొన్ని రోజులుగా కొణిదెల ప్రొడక్షన్ పై చేయుచున్న పోరాటనికి  దక్షిణాది ఉయ్యాలవాడ నర్సింహ రెడ్డి సేవ సమితి అధ్యక్షుడు కేతి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి కూడా వారికి మద్దతు తెలిపారు.  ఈ సందర్భంగా కేతిరెడ్డి  మాట్లాడుతూ... ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కథ తీసుకొని మోసం చేశారని,  చిరంజీవి, రామ్ చరణ్ ఇచ్చిన మాట ప్రకారం వారికి న్యాయం చేయటం వారి బాధ్యత అని  ఇచ్చిన మాట తప్పి న్యాయం కోసం పోరాటం చేస్తే వారి పైనే అక్రమ కేసులు పెట్టడం కరెక్ట్ కాదని, ఆవేదన వ్యక్తం చేశారు.  సైరా నరసింహారెడ్డి సినిమాను విడుదలను నిలిపివేయాలన్నారు. వారికి ఉన్న హక్కు ను నిర్ధారించాలన్నారు. ఈ మేరకు  దాఖలు  చేసిన పిటేషనును బుధవారం  హై కోర్టులో జస్టీస్ రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం ముందు విచారణకు రానున్నాదని పేర్కొన్నారు.



ఈ ఫిటీషన్ లో ముఖ్యంగా దాదాసాహెబ్ ఫాల్కే కు ఎంపికైన అమితాబ్ బచ్చన్ ను కూడా రెస్పాండెంట్ గా చేర్చటం జరిగిందన్నారు. ఆయనతో పాటు చిరంజీవి, రాంచరణ్ , రాష్ట్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డ్ చైర్మన్, సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ , ముంబయి. హైదరాబాద్, చెన్నై , అధికారులను  డైరెక్టర్ సురేందర్ రెడ్డిలు ఉన్నారని తెలిపారు. ఆ పిటిషన్ లో ప్రధానంగా వారికి ఉన్న హక్కుల నేపధ్యంలో వారి అనుమతి లేకుండా చిత్రాన్ని నిర్మించడం , చిత్రాన్ని యదార్ధ కధ కాకుండా వక్రీకరించి తీశారని చెప్పారు. ఈ విషయాలన్ని పైన స్పష్టత వచ్చే వరకు చిత్ర ప్రదర్శనను నిలపాలని పిటిషనర్ తరపున పోనక జనార్ధన్ రెడ్డి తమ వాదనలను కోర్టు కి వినిపించేందుకు  సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ  విషయాన్ని  కొంత మంది ఇతర కులాల వారు ఒక తెర మరుగు అయ్యిన ఉయ్యాలవాడను ఒక కాపు సామాజిక వర్గం నాకు చైoదిన వారు నిర్మించుచుంటె, రెడ్డి సామాజిక వర్గం చిరంజీవి ని ఇబ్బందులకు గురి చేయుచున్నారని సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం జరుగుతుందని ,స్వాతంత్ర్య సమర యోధుడి వంశస్థులకు కులం అపాదించటం తప్పని...ఆయనకు మీరు పబ్లిసిటీ ఇవ్వడం ఎమిటి..చరిత్ర ఉంటేనే కధ సినిమా తీస్తున్నరన్న విషయం ను మీరు మర్చి పోకూడదు...చిరంజీవి గారు ,పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు.  కాబట్టి ఇలాంటి వాదనలకు ఫుల్ స్టాప్ పెట్టాలని మీరు మీ కులసంఘలకు, మీ అభిమానులకు  పిలుపు ఇవ్వాలనన్నారు. ఏదేమైనా సరే ఈ సమస్య  పరిష్కారం  చేయటానికి  వెంటనే చొరవ చూపాలన్నారు.  కేతిరెడ్డి ఈ సమావేశంలో చిరంజీవిని డిమాండ్ చేశారు.





ఉయ్యాలవాడ 5 వ తరం వారసుదు దొరవారి దస్తగిరిరెడ్డి  చిత్ర ప్రారంభంలో తమను ఇంటికి పిలిపించుకుని తమతో రాంచరణ్ సంతకాలు తీసుకొని , ఆయన చరిత్రను తెలిపినందుకు వారసులుగా తమకు కొంత డబ్బు చెల్లిస్తానను మాట ఇచ్చారని వారు అన్నారు. ఇప్పుడు చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్నాక తమకు ఇచ్చిన మాటను తప్పి తమకు సిటీ సివిల్ కోర్ట్ నుండి నోటీసులు పంపించారని చెప్పారు. ఇది ఎమీ వ్యవహారమని, మా ఆవేదనలను మీడియాలో రాకుండా అడ్డుకొంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రాయలసీమ వాసిగా పట్టించుకోవలనిన్నారు. రాయలసీమ ప్రాంతంనాకు చెందిన మమ్మల్ని, కుటుంబసభ్యులను పెడుతున్న బాధలను తీర్చి..స్కూల్ పిల్లలకు తొలి తెలుగు స్వాతంత్ర సమర యోధుడి గాధను గాంధి సినిమా ప్రదర్శించిన విధంగా ఉచితంగా ప్రదర్శించని... వచ్చిన లాభం లో రాష్ట్రప్రభుత్వం నాకు 50 శాతం ఇవ్వాలని డిమాండ్ఇ చేశారు. ఎప్పటికైనా నిర్మాత రాంచరణ్ , హీరో చిరంజీవిలు స్పందించి తమకు ఇచ్చిన హామీ మేరకు ఆదుకోవాలనన్నారు.  చిత్రం విడుదలకు ముందే వారసులకి చిత్రాన్ని ప్రదర్శించాలని.ఉయ్యాలవాడ కథను వక్రీకరించి చిత్రీకరించి నట్లు మాకు తెలిసిందని తెలిపారు.  ఈ సమావేశంలో ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి వారసులు దస్తగిరి రెడ్డి , లక్ష్మీ కుమారి , సాంబశివ రెడ్డి , జయరాం రెడ్డి , జగదీశ్వర్ రెడీ పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: