వేణుమాధవ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు.  పవన్ కళ్యాణ్ సినిమాల్లో మంచి వేషాలు వేశాడు.  తమ్ముడు, తొలిప్రేమ సినిమాల్లో మంచి పేరు వచ్చింది.  నల్లబాలు అనే పేరుతో బాగా ఫేమస్ అయ్యాడు.  లక్ష్మి సినిమాలోని నటనకు మంచి పేరు వచ్చింది.  అలాంటి వేణుమాధవ్ రుద్రమదేవి సినిమా తరువాత సినిమాల్లో నటించలేదు.  అయన నటించిన డాక్టర్ పరమానందయ్య అనే సినిమా ఇంకా రిలీజ్ కావాల్సి ఉన్నది.  


ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సంప్రదాయం అనే సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీకి కమెడియన్ గా పరిచయం అయ్యాడు.  ఆ సినిమా తరువాత వరసగా సినిమా ఆఫర్లు వచ్చాయి.  ఆయన కమెడియన్ గా సినిమా ఇండస్ట్రీలో నిలబడిపోయాడు.  కమెడియన్ గా మిమిక్రి ఆర్టిస్ గా వేణుమాధవ్ మెప్పించారు.  అయితే, గత కొన్ని రోజులు అనారోగ్యంతో బాధపడుతున్నాడు.  


అప్పట్లో ఆయనపై వచ్చిన అనారోగ్యం విషయాన్ని కొట్టిపారేశాడు.  అవన్నీ రూమర్లే అని కొట్టేశారు.  ప్రస్తుతం అయన కాలేయ, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు.  హాస్పిటల్ లో వెంటిలేటర్ చికిత్స అందిస్తున్నారు.  వేణుమాధవ్ కు ఆరోగ్యం బాగాలేదు అని తెలిసిన తరువాత సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు అయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.  ఇదిలా ఉంటె సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు వేణుమాధవ్ ఏం చేసేవారు అనే విషయం చాలా మందికి తెలియదు.  


వేణుమాధవ్ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఉండేవారు.  ఆ పార్టీ ఆఫీస్ లో ఆఫీస్ బాయ్ గా పనిచేశారట.  ఆఫీస్ బాయ్ గా పనిచేస్తూ.. అంచలంచెలుగా ఎదిగి.. అన్నగారికి దగ్గరయ్యారట.  అందుకే ఆయన సినిమాల్లో ఎన్టీఆర్ ను ఇమిటేట్ చేయడం అంటే చాలా ఇష్టపడేవారు.  తెలుగుదేశం పార్టీ ప్రచారంలో కూడా చాలాసార్లు పాల్గొన్నారు.  సినిమా ఇండస్ట్రీ కంటే తనకు ముందు తెలుగుదేశం పార్టీ ఆదరించి అన్నం పెట్టిందని అన్నగారిని పలుమార్లు తలచుకున్నారు వేణు మాధవ్.  


మరింత సమాచారం తెలుసుకోండి: