ఆ కుర్రాడి పేరు లైడియన్ నాదస్వరం.. వయసు 13 ఏళ్లు. అంత చిన్న వయసులోనే తన సంగీత జ్ఞానంతో ఏఆర్ రెహ్మాన్, మోహన్‌లాల్ వంటి సినీ ప్రముఖులను ఆకట్టుకున్నాడు. తాజాగా ఓ బంగారంలాంటి అవకాశాన్ని అందుకున్నాడు. సూపర్ స్టార్ మోహన్ లాల్ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ దక్కించుకున్నాడు.
మలయాళం స్టార్ హీరో మోహన్‌లాల్ తొలిసారి మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారబోతున్నారు. `బరోజ్` పేరుతో ఓ సినిమాను తెరకెక్కించబోతున్నారు. పూర్తి 3డీ టెక్నాలజీతో భారీగా రూపొందిస్తున్న ఈ సినిమాకు సంగీతదర్శకుడిగా నాదస్వరంను తీసుకున్నారు. 13 ఏళ్ల వయసులోనే అరుదైన అవకాశం అందుకున్న నాదస్వరంను సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు.


ఇటీవ‌లె విడుద‌లైన బందోబ‌స్త్ చిత్రంలో మోహ‌న్‌లాల్  దేశ ప్రధానిగా కీలకపాత్రలో నటించారు. ఆయ‌న న‌టించింది చాలా త‌క్కువ స‌మ‌యం అయిన‌ప్ప‌టికీ త‌న‌కున్న పాత్ర‌కు మంచి మంచి డైలాగ్స్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. ఆయనకు సెక్యురిటీ ఆఫీసర్‌గా సూర్య కనిపిస్తున్నారు. రైతుగా, సైనికుడిగా, టెర్రరిస్ట్‌గా విభిన్న పాత్రల్లో వైవిధ్యభరిత నటనను ప్రదర్శిస్తున్నారు సూర్య. ఆర్య, బొమన్ ఇరానీ, సాయేషా సైగల్ ఇతర పాత్రల్లో నటించగా.. హరీష్ జయరాజ్ మ్యూజిక్ అందించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ‘రంగం’ ఫేమ్ కె.వి.ఆనంద్ దర్శకత్వం వహించారు. ‘కాప్పన్’ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో ‘బందోబస్తు’ పేరుతో విడుదల చేశారు.  గ‌తంలో మలయాళంలో  మోహన్ లాల్ హీరోగా ఒడియన్ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా రూ.140 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కానీ ఆశించినంత ఫ‌లితం రాలేద‌నే చెప్పాలి. అంతేకాక సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటించిన‌ జనతాగ్యారేజ్‌లో మళయాళం హీరో మోహన్‌లాల్, దేవయాని, సురేష్, బ్రహ్మాజీ కీలకపాత్రల్లో నటించారు.  అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ (అమ్మ) కు అధ్యక్షుడు మోహన్‌లాల్‌ . 


మరింత సమాచారం తెలుసుకోండి: