తెలుగు సినీ విమర్శకుడు కత్తి మహేష్ పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ లో ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా కూడా తనదైన స్టైల్లో కామెంట్లు పెడుతూనో, లేక ఏదొక కారణంతో సినిమాపై దుమ్మెత్తి పోస్తూ వస్తాడు. అది అయన నైజం. కలియుగ దైవం శ్రీరాముడిపై సంచలన కామెంట్లు చేసి నగర బహిష్కరణ ఆయన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం హాట్ గా చర్చలు జరగడంతో కొద్దీ రోజులు మీడియా కు దూరంగా ఉన్నాడు. 


అంతేకాదండోయి.. యూత్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్లు చేసి పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమయ్యాడు. దానితో ఇంకా సినిమా వైపు కన్నేయడని చాలా మంది అనుకున్నారు కానీ, మళ్ళీ అయన ఈ మధ్య తరచూ కనిపిస్తున్నాడు. ఎటు రాజకీయాల వైపు, సినిమా వైపు ట్రోల్స్ వేస్తూ ఆడుకుంటున్నాడు. 


వివరాల్లోకి వెళితే.. తాజాగా ఈయన ఇప్పుడు మరో కీలక విషయంతో ముందుకొచ్చాడు. అదేంటంటే.. మొన్న రిలీజ్ అయినా సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ సైరా సినిమాకు సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్. మేకప్, కాస్త్యుమ్స్ విషయంలో చక్కగా వ్యవహరించిన సుష్మితపై చిరంజీవి ప్రశంసలతో ముంచేశారు. 


కేవలం సుష్మితానే కాదు ఇంకో అమ్మాయి కూడా పనిచేసింది. ఆ అమ్మాయిని గురించి మాట్లాడారు అంటూ చిరు ఫ్యామిలీపై కామెంట్లు చేసాడు కత్తి మహేష్. ఒకరే చేశారు అన్నట్లు ఒకరినే పొగడకూడదు అంటూ అయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతుంది. కత్తి ఇలా మరో సారి చిరు ఫ్యామిలీ జోలికి రావడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: