తెలుగు లో తనదైన హాస్యాన్ని పండించిన కమెడియన్ వేణు మాధవ్ పరిస్థితి పూర్తిగా విషమించడంతో  కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చేర్చగా, వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.  కమెడియన్ వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు ఆయన ప్రతినిధులు వెల్లడించారు. కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతున్న వేణుమాధవ్ కు సినిమా అవకాశాలు దాదాపు సన్నగిల్లిపోయాయి. చాలా కాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్న వేణు మాధవ్ కి ఇటీవలే  కిడ్నీ సమస్యలు కూడా మొదలయ్యాయి. 

ఈ నేపథ్యంలోనే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాగా, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ నెల 6వ తేదీన ఆసుపత్రిలో చేరారు. కొన్ని రోజుల నుంచి వేణుమాధవ్‌కు డయాలసిస్‌ చేస్తున్నారు. మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు.  ఈ విషయం తెలుసుకున్న సినీ నటులు జీవిత, రాజశేఖర్ యశోదా ఆసుపత్రికి వచ్చారు. వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంటనే కోలుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు రావాలని రాజశేఖర్ దంపతులు కోరుకున్నారు. 

వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.  చిన్న తనం నుంచి నటనపై ఎంతో అభిరుచి పెంచుకున్న వేణు మాధవ్ మంచి ఆర్టిస్ట్ కావాలని మిమిక్రి నేర్చుకున్నారు..ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు.  వేణు మాధవ్ మొదటి సినిమా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన ‘సాంప్రదాయం’ సినిమాలో నటించాడు.  ఆ తర్వాత తనదైన కామెడీ మార్క్ చాటుకుంటూ..ఎన్నో సినిమాలో క్యారెక్టర్, కమెడియన్ గా నటించాడు.  ఒకటీ రెండు సినిమాల్లో వేణు మాధవ్ హీరోగా కూడా నటించారు. పలువురు సినీ సెలబ్రెటీలు వేణు మాధవ్ కి నయం కావాలని కోరుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: