తెలుగు లో ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ మార్క్ చాటుకున్న కమెడియన్ వేణు మాదవ్ ఇకలేరు.  గత కొంత కాలంగా మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న ఆయనను ఈ నెల 6న యశోద ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు.  అప్పటి నుంచి ఆయనకు డయాలసీస్ చేస్తూ వస్తున్నారు.  మంగళవారం నుంచి ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది..నేడు ఆయన ఈ లోకాన్ని వీడిపోయారు.  తెలుగులో వేణు మాధవ్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఈయన పుట్టింది నల్గొండ జిల్లా కోదాడ. అక్కడే ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. నాలుగో తరగతి నుంచే మిమిక్రీ చెయ్యడం ప్రారంభించాడు.

అమితాబ్ బచ్చన్, ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సులేయడం, వారిని అనుకరించి మాట్లాడటం మొదలైనవన్నీ చేసేవాడు.ఈయనకు వెంట్రిలాక్విజం మీద బాగా ఆసక్తిగా ఉండేది. అదే ఆసక్తితో బాంబే (ప్రస్తుతం ముంబై) నుంచి ప్రత్యేకంగా రూపొందించిన ఒక బొమ్మ తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి మంచి మిమిక్రి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు.  ఒకరోజు నల్గొండ ప్రదర్శన ఇస్తున్నపుడు చంద్రబాబు నాయుడు చూసి, మహానాడులో ప్రదర్శన ఇవ్వమన్నాడు. మహానాడు ప్రదర్శనలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాడు. సభ అయిపోయిన తరువాత ఎన్టీఆర్ వేణు దగ్గరికి వచ్చి మీ సేవలు మా కెంతో అవసరం బ్రదర్  అని చెప్పి చంద్రబాబు నాయుడు వైపు తిరిగి వీరిని మనతో పాటే ఉంచండి  అని అన్నాడు.

అలా తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పరిచయమైంది. ఆ తర్వాత అసెంబ్లీ లోని టీడీఎల్పీ ఆఫీసులో లైబ్రరీ అసిస్టెంటుగా చేర్చారు. తరువాత ఎన్టీఆర్ ఇంట్లో అసిస్టెంట్ గా కూడా కొద్దిరోజులు పనిచేశాడు. బొమ్మతో మిమిక్రీ చేస్తాడు కాబట్టి ఎన్టీయార్ ఆయన్ని‘బొమ్మగారూ!’ అని ఆప్యాయంగా పిలిచేవారు. వేణు మాధవ్ మృతిపై టాలీవుడ్ సెలబ్రెటీలు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు..వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: