తెలుగు సినీ చరిత్రలో ఎంతో మంది కమెడియన్లు తమదైన కామెడీ ముద్ర వేశారు.  అలాంటి వారిలో  వేణు మాధవ్ ఒకరు.  మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన వేణుమాధవ్, 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ హీరోగా నటించిన ‘సంప్రదాయం’ సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టి, 400లకు పైగా సినిమాల్లో నటించాడు. వేణుమాధవ్ 1969, డిసెంబరు 30న సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించాడు. కాగా, కాలేయ సంబంధవ్యాధితో బాధపడుతున్న వేణుమాధవ్ సికింద్రాబాద్ లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, సెప్టెంబరు 25 మధ్యాహ్నం గం. 12.21 ని.లకు మరణించాడు.

ఒకసారి రవీంద్ర భారతిలో వేణు మాధవ్ ఒక బొమ్మతో వెంట్రిలాక్విజం చేస్తు..మిమిక్రితో అందరినీ కడుపుబ్బా నవ్వించారు.  ఆ ప్రదర్శన చూసిన అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిలు చూసి సినిమాలలో అవకాశం ఇచ్చారు. పవన్ కళ్యాన్ నటించిన  ‘తొలిప్రేమ’ సినిమాలో అమ్మాయిలపైన చాటభారతమంత డైలాగ్ తో అందరి మనసు దోచాడు. తర్వాత నితిన్ నటించిన‘దిల్’ సినిమాలో హీరో మామగా నటించి మంచి నవ్వులు పూయించాడు.  2006లో వెంకటేష్ నటించిన  ‘లక్ష్మి’ సినిమాతో ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నాడు. హంగామా సినిమాతో హీరోగా మారిన వేణుమాధవ్, ప్రేమాభిషేకం సినిమాను నిర్మించాడు. ఇంకా అతనికి పేరు తెచ్చిన సినిమాలు తొలిప్రేమ, సై, ఛత్రపతి, మొదలైనవి. చివరిసారిగా రుద్రమదేవి, డాక్టర్ పరమానందయ్య స్టూడెంట్స్ గ్యాంగ్ (2016) సినిమాలలో నటించాడు.

గతంలో తన అభిమాన నటుడు ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో అనేకసార్లు తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల్లో ప్రచారం చేశాడు.  అందరినీ నవ్విస్తూ ఉండే వేణుమాధవ్ మరణంతో తెలుగు సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. కాసేపటి క్రితం సినీ నటులు శివాజీరాజా, అలీ, ఉత్తేజ్ యశోద ఆసుపత్రికి చేరుకున్నారు.ఈ సంద్భంగా పలువురు సినీ సెలబ్రెటీలు మాట్లాడారు.

ఈ సందర్భంతా నటుడు శివాజీరాజా మాట్లాడుతూ.. టాలీవుడ్ లో అతి తక్కువ కలాంలో వేణుమాధవ్ మంచి గుర్తింపును తెచ్చుకున్నారని అన్నారు. పేద ప్రజల కోసం తన వంతు సాయం చేసిన గొప్ప వ్యక్తి అని కితాబిచ్చారు. వేణు కారులో ఎప్పుడూ ఆహార పదార్థాలు ఉంటాయని... వాటని పేదలకు పంచేవాడని చెప్పారు. అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ లో రేపు వేణుమాధవ్ పార్థివదేహాన్ని ఉంచుతామని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: