ప్రముఖ సినీ నటుడు, కమెడియన్ వేణుమాధవ్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొంతకాలం నుండి కాలేయం, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న వేణుమాధవ్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. వేణుమాధవ్ మిమిక్రీ కళాకారునిగా కెరీర్ ప్రారంభించాడు. సంప్రదాయం సినిమాతో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టాడు. 
 
పవన్ కళ్యాణ్ తొలిప్రేమతో గుర్తింపు తెచ్చుకున్న వేణుమాధవ్ కు వరుసగా అవకాశాలు వచ్చాయి. హంగామా సినిమాలో వేణుమాధవ్ హీరోగా నటించాడు. హీరోగా, నిర్మాతగా వేణుమాధవ్ నిర్మించిన ప్రేమాభిషేకం అనే సినిమా వేణుమాధవ్ కు నష్టాలు తెచ్చిపెట్టింది. ఆది, సై, సింహాద్రి, వెంకీ, రణం, పోకిరి, రచ్చ, ఛత్రపతి సినిమాల్లోని పాత్రలు వేణుమాధవ్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 
 
వేణుమాధవ్ సినిమాల్లోకి రాకముందు నల్గొండ జిల్లా కోదాడలో ఒక షో చేశాడు. ఆ షోలో వేణుమాధవ్ అభినయం నచ్చి ఆ ఊరి ఎమ్మెల్యే వేణుమాధవ్ ను మహానాడుకు తీసుకొని వెళ్లారు. వేణుమాధవ్ మహానాడులో సీనియర్ ఎన్టీయార్ ముందు  టాకింగ్ టామ్ తో ప్రదర్శన ఇచ్చారు. ఆ ప్రదర్శన నచ్చిన సీనియర్ ఎన్టీయార్ మీ సేవలు మాకు ఎంతో అవసరం. మీరు మాతోనే ఉండాలి అని తీసుకొనివెళ్లి హిమాయత్ నగర్ టీడీపీ ఆఫీసులో పెట్టారు. 
 
వేణుమాధవ్ కు 600 రూపాయలు నెల జీతంగా ఇచ్చారు. టీడీపీ ఆఫీసులో వచ్చిన ఫోన్ కాల్స్ వేణుమాధవ్ చూసుకొనేవాడు. ఒకరోజు ఫోన్ రింగ్ అయిన సమయంలో వేణుమాధవ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని గట్టిగా మాట్లాడాడు. అవతలి వైపు నుండి నమస్కారం! నందమూరి తారకరామారావును మాట్లాడున్నాను. ఫోన్ రామచంద్రారావు గారికి ఇవ్వండి అని సీనియర్ ఎన్టీయార్ మాట్లాడారు. ఫోన్ రామచంద్రారావు గారికి ఇచ్చిన తరువాత 10 నిమిషాలు వారిద్దరి మధ్య సంభాషణ జరిగింది. 
 
ఆ తరువాత రామచంద్రారావు బయటకు వచ్చి వేణుమాధవ్ తో బుద్ధి జ్ఞానం ఉందా? ఇది నీ ఇంటి ఫోన్ అనుకుంటున్నావా? హలో అని గట్టిగా అరుస్తూ మాట్లాడకూడదు. ఫోన్ లిఫ్ట్ చేయగానే నమస్కారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అనాలి కదా ఎందుకు అనలేదు. అన్నగారు సీరియస్ అయ్యారని రామచంద్రారావు వేణుమాధవ్ తో చెప్పాడు. కొంత సమయం తరువాత ఫోన్ మరలా రింగ్ అయింది. ఫోన్ లిఫ్ట్ చేసిన వేణుమాధవ్ నమస్కారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అని చెప్పాడు. అవతలివైపునుండి సీనియర్ ఎన్టీయార్ అదీ బ్రదర్ అని ఫోన్ పెట్టేశాడు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: