సినీ హ‌స్య న‌టుడు వేణుమాధ‌వ్ గ‌త కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధ‌ప‌డుతూ సికింద్రాబాద్‌లోని యాశోద ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు క క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న సినీ రంగంలోనే కాదు...రాజ‌కీయ రంగంలో, చ‌దువుకు ఉన్న ప్ర‌త్యేక‌త గురించి ఎన్నో ప్ర‌ద‌ర్శ‌న‌లు చేయ‌డంలో ఎంతో పేరు తెచ్చుకున్నారు. 
 
వేణు మాధవ్ ఉమ్మడి నల్గొండ జిల్లా లో ‘చదువు వెలుగు’ అనే ఉద్యమం ద్వారా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుక‌న్నారు. ఈ సమయంలో నల్గొండ జిల్లాలోని వందలాది గ్రామాల్లో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు వేణుమాధవ్. మాట్లాడే బొమ్మ పేరుతో చదువు వెలుగు ఉద్యమం లో ఎన్నో వేలాది ప్రదర్శనలు ఇచ్చారు.
నల్గొండ జిల్లాలో 1989-90 లోఅప్పటి జిల్లా కలెక్టర్ నరసింహరావు  ‘చదువు వెలుగు’ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక, ఆంధ్ర ప్రజానాట్య మండలికి చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు. చదువుకు ఉన్న ప్రత్యేకత గురించి తెలియజేశాడు వేణు. 


ఈ సమయంలో చదువు కు ఉన్న ప్రత్యేకతను తెలియజేసేందుకు మాట్లాడే బొమ్మతో వేణు మాధవ్ ప్రదర్శనల ద్వారా జనాల్లో ఎంతో పేరు తెచ్చుకున్నారు. అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఆంధ్రప్ర జానాట్య మండలికి చెందిన అంజన్న సారాధ్యంలో వేలాది  కళాకారులు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తన ప్రదర్శనలు గావించాడు. చదువుకు ఉన్న ప్రత్యేకతను చాటుతూ వీధి నాటకాలు కూడా ప్రదర్శించేవారు. అలాగే అంజన్న నేతృత్వంలో పల్లెసుద్దులు, మన చరిత్ర, కురుక్షేత్రరం, ఆగిపోని నాటిక అనే పేరుతో ప్రదర్శనలు చేశారు.  ఈ నాటికల్లో వేణుమాధవ్ నటించారు. అలాగే మన చరిత్ర అనే నాటికలో వేణు మాధవ్  కానిస్టేబుల్ గా పాత్ర పోషించాడు. ఈ సమయంలో వేణుమాధవ్ నటన ద్వారా అందరిని ఆకట్టుకొంది. 


అయితే ఆ తర్వాత వేణు మాధవ్ హైదరాబాద్ కు వచ్చాడు. అప్పటి కోదాడ ఎమ్మెల్యే చందర్ రావు ద్వారా హైదరాబాద్ కు చేరుకున్నాడు. తర్వాత టీడీపీ కార్యాలయంలో కొన్ని రోజులుగా పని చేశారు. ఆ తర్వాత సినీ రంగంలో ప్రవేశించారు. ఆనాటి హోంశాఖ మంత్రిగా ఉన్న మాధవ రెడ్డి సహకారంతో సినీ రంగంలో ప్రవేశించారట. వేణుమాధ‌వ్ ఇలాంటి ప్ర‌ద‌ర్శ‌న‌ల ద్వారా సినీ రంగంలో ప్ర‌వేశించి త‌న‌దైన శైలిలో న‌ట‌న కొన‌సాగించి, అంద‌రి మ‌న‌సు దోచుకున్నారు. త‌న హ‌స్య‌న‌ట‌న‌తో  వేణుమాధ‌వ్ అంటే ఎవ్వ‌రు కూడా మ‌ర్చిపోలేని విధంగా చేశాడు. వేణుమాధ‌వ్ హ‌స్యం అంటే ప‌డిచ‌చ్చేవాళ్లు ఎంద‌రో ఉన్నారు. వెంకీ సినిమాలో ట్రైన్‌లో చేసిన హ‌స్య ప్ర‌ద‌ర్శ‌న ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా వ‌చ్చిందంటే చాలు అందులో ట్రైన్‌లో ఉన్న హాస్యం కోస‌మే చూస్తుంటారు. ఇదొక్క‌టే కాదు..ఇలాంటివి ఎన్నో హాస్య స‌న్నివేశాల‌ను ప్ర‌ద‌ర్శించి అంద‌రి మ‌న్న‌న‌లు పొందాడు వేణు మాధ‌వ్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: