ప్ర‌ముఖ హ‌స్య న‌టుడు వేణుమాధ‌వ్ అనారోగ్యం కార‌ణంగా మృతి చెంద‌డం  సినీ ఇండ‌స్ట్రీలోనే కాకుండా ప్రేక్ష‌కుల‌ను ఎంతో క‌ల‌చివేసింది. ఆయ‌న మృతి సినీ ప‌రిశ్ర‌మ‌ల‌కు  తీరని లోటని న‌టుడు రాజశేఖర్‌ అన్నారు. వేణుమాధవ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అతనితో తనకున్న అనుబంధాన్ని రాజ‌శేఖ‌ర్ గుర్తు చేసుకున్నారు. చివ‌రి సారిగా ఆస్ప‌త్రిలో రాజ‌శేఖ‌ర్‌రెడ్డి దిగిన ఫోటోను షోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.ఈ ఫోటోలో కూడా వేణుమాధ‌వ్ అస‌లు గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా ఉన్నాడు. వేణుమాధవ్‌ మా కుటుంబానికి ఎంతో సన్నిహిత మిత్రుడు. నన్ను బావా అని, జీవితను అక్క అని పిలిచేవాడు. వేణుమాధ‌వ్ పండ‌ల‌కి ఫోన్ చేసి విష్ చేసేవాడ‌ని గుర్తు చేశారు. మేమంటే తనకు ఎంతో అభిమాన‌మ‌ని అన్నారు. మేమిద్దరం కలిసి సుమారు పది చిత్రాల్లో నటించాం. ‘మనసున్న మారాజు’, ‘రాజ సింహం’, ‘ఒక్కడు చాలు’, ‘గోరింటాకు’ చిత్రాల్లో తన నటనకు వేణుమాధ‌వ్ చేసిన కామేడీ ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇండ‌స్ట్రీలో ప్ర‌ర‌తి ఒక్క‌రిని వ‌రుస‌లు పెట్టి పిలుస్తూ క‌లుపుకొని ఉండేవాడ‌ని చెప్పుకొచ్చాడు రాజ‌శేఖ‌ర్‌. అంత మంచి వ్య‌క్తి ఇలా అంద‌రికి దూరం కావ‌డం బాధ‌క‌ర‌మ‌న్నారు. 


‘‘అయితే (మా) ఎన్నికల సమయంలోనే వేణుమాధవ్‌కి ఆరోగ్యం బాలేదట .... కానీ, ఎవరికీ తెలియన్విలేదు. సాటి కళాకారుల కోసం ముందడుగు వేశాడు. ఎన్నికల్లో విజయం సాధించాడు. తర్వాత వ్యక్తిగతంగా కొన్ని కార్యక్రమాలకు హాజరు కాకపోయినా.. ‘మా’కు సంబంధించి ఏం వచ్చినా వెంటనే స్పందించేవాడు. తన అభిప్రాయం చెప్పేవాడు. గత వారం ఆయన హాస్పిటల్‌లో ఉంటే వెళ్లి కలిశాను. సోమవారం సాయంత్రం డిశార్జ్‌ అయ్యారు. మళ్లీ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యాడ‌ని మంగళవారం ఆస్ప‌త్రిలో అడ్మిట్‌ చేశారు. అందరినీ ఎన్నో ఏళ్లుగా నవ్వించి, నవ్వించి ఈ రోజు లోకాన్ని విడిచి వెళ్లి ఏడిపిస్తున్నారు’’ అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు న‌టుడు రాజ‌శేఖ‌ర్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: