గత  మూడు రోజులుగా  తెలుగు రాష్ట్రాల్లో  ఎడతెరిపి లేకుండా  కురుస్తున్న వర్షాల వల్ల జన జీవనం అస్థవ్యస్థమవుతుంది. వరదల వల్ల  జనావాసాల్లోకి  నీరు చేరడంతో   సామాన్య ప్రజలు  తీవ్ర అవస్థలు  పడుతున్నారు. ఇక ఈ వర్షం  సినిమా వాళ్లని కూడా ఒదిలి పెట్టలేదు.


మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన  లేటెస్ట్ మూవీ  గద్దలకొండ గణేష్. విడుదలైన మొదటి  రోజునుండే సూపర్ హిట్ టాక్ ను రాబట్టుకుంది ఈ చిత్రం.  టాక్ కు తగ్గట్లే  మొదటి నాలుగు రోజులు మంచి వసూళ్లను రాబట్టింది. అయితే  వర్షాల కారణంగా మంగళ, బుధవారాల్లో  ఈచిత్రం యొక్క కలెక్షన్స్  భారీగా  డ్రాప్ అయ్యాయి.  ముఖ్యంగా  ఫస్ట్ షో , సెకండ్ షో  లపై వర్షం  తీవ్ర ప్రభావం చూపించింది. దాంతో ఈ చిత్రం 5 రోజుల్లో  తెలుగు రాష్ట్రాల్లో  17కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇదే రన్ ను కొనసాగిస్తే  ఈచిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా కష్టమే అవుతుంది. 



హరీష్ శంకర్   డైరెక్షన్ లో  గ్యాంగ్ స్టార్ డ్రామా గా  తెరకెక్కిన ఈ చిత్రం లో వరుణ్ నటన , డైలాగ్స్ , హరీష్ మార్క్ డైరెక్షన్  హైలైట్ అయ్యాయి.  కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ  'జిగర్తండా' కు రీమేక్ గా  రూపొందిన  ఈచిత్రంలో   తమిళ  యువ హీరో అథర్వ మురళి ముఖ్య పాత్రలో నటించగా పూజాహెగ్డే , మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు. వీరితో పాటు  హాట్ బ్యూటీ డింపుల్ హయాతి  ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. 14 రీల్స్ ప్లస్  బ్యానర్ ఫై  రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట  నిర్మించిన  ఈచిత్రానికి  మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: