తెలుగుతో పాటుగా, తమిళ్, మలయాళ చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్నా బ్యూటీ నయనతార.. లేడీ బాస్ గా డేరింగ్, డ్యాషింగ్ సినిమాలలో నటిస్తున్న నయన్ ఎన్నో సినిమాలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత కొంతకాలంగా ఈ అమ్మడుకు హిట్ సినిమాలు లేవనే చెప్పాలి. అజిత్ తో నటించిన విశ్వాసం సినిమా మాత్రమే ఆమెకు ఓ మాదిరిగా గుర్తింపును తీసుకొచ్చింది. 


వివరాల్లోకి వెళితే.. గతంలో నయన్ ప్రభుదేవా తో సహజీవనం చేస్తుందనే విషయం తెలిసిందే.. ఇకపోతే ఏమైందో తెలియదుగాని, ఆ అమ్మడు బ్రేకప్ చెప్పింది. ప్రస్తుతం తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమాయణంలో ఉన్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఈ బ్యూటీ ప్రియుడితో కలిసి చెట్టాపట్టాలేసుకొని షికార్లు మరియు ఈవెంట్లకు హాజరవుతుంది. మరో విశయమేంటంటే వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారనే వార్తలు కూడా కోలీవుడ్ లో వినపడుతున్నాయి. 



ఇటీవల కాలంలో నయన్ తన సొంత డబ్బులను ప్రియుడికిచ్చి అతనిని నిర్మాతగా కూడా మార్చింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయనతార ఇప్పటిలో పెళ్లి చేసుకోదు  అనే వార్తలు సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. అయితే, ఆమె ప్రస్తుతం పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఐదురోజుల పెళ్లి వేడుకలు జరిపించాలని ఆలోచనలో నయన్ ఉందట. 



ఇకపోతే గతంలో రెండు సార్లు ప్రేమలో విఫలమైన నయన్.. ఈ సారి విఘ్నేష్ తో నడిపిన ప్రేమ వ్యవహారం పెళ్లి పీఠలను ఎక్కించబోతుంది. శివన్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అతనితో నా జీవితం సాఫీగా సాగుతుందని నయన్ నమ్ముతుంది. అతి త్వరలోనే పెళ్లి డేట్ అనౌన్స్ చేస్తానని నయన్ అన్నారు. విఘ్నేష్ శివన్ నిర్మించనున్న 'నెట్టికన్' సినిమాలో నయనతార నటిస్తుంది.  అంతేకాదు చిరు సైరా సినిమాలో కూడా నటించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: