ఎదుటి వారు ఎంతటి వారైనా సరే వర్మ ట్వీట్లన్నా, పోస్టులన్నా జడవాల్సిందే. నాకు అనిపించింది నేను మాట్లాడతా అని చెప్పే వర్మ మాటల్లో కొందరికి నిజం కనిసిస్తే మరికొందరికి శాడిజం కనిపిస్తుంది.  సినీ ప్రముఖుల మీద, సామజిక అంశాల మీద ట్వీట్లు,కామెంట్లు పెడుతూ ఉండే వర్మ ఈ సారి బిగ్ బి - అమితాబ్ పై ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు.  అమితాబ్ బచ్చన్‌ గారు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనట్టు ప్రకటించడంతో పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేధికగా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. 

ఈ తరుణంలో ఇండియన్ షెహన్ షా అమితాబ్ బచ్చన్ కు వచ్చిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుపై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పేశాడు వర్మ.  'దాదా సాహెబ్ ఫాల్కే గురించి తనకు  సరైన అవగాహన లేదన్నాడు. ఎందుకంటే.. ఆయన తీసిన రాజా హరిశ్చంద్ర సినిమాని 10 నిముషాల కంటే ఎక్కువసేపు చూడలేకపోయాడట. అందులో 10 రకాలుగా సినిమా చూపారు. కానీ, మీరు చేసిన 10 రకాల సినిమాలను నేను అంతకంటే ఎక్కువ సార్లు చూసాను. కాబట్టి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ మీకు ఇచ్చే బదులు.. 'అమితాబ్' అవార్డునే పెట్టి దాదా కు ఇస్తే బాగుంటుంది కదా అన్నారు.

ఇంతకుముందు ఈ అవార్డును తీసుకున్న వారికి మీలో ఉన్నంత ఫైర్ లేదు. కాబట్టి నాకు ఈ అవార్డు మీద పెద్దగా ఆసక్తి లేదు. బహుశా ఈ అవార్డులు ఇచ్చే కమిటీ వాళ్ళు మీ సినిమాలేవీ సరిగా చూడలేదని నా అభిప్రాయం' అంటూ నిర్మొహమాటంగా తన ఉద్దేశాన్ని ఇన్ స్టాగ్రామ్ లో చెప్పేసాడు.వర్మ మాట్లాడితే ఎంత వెటకారంగా ఉంటుందనే దానికి ఇదొక ఉదాహరణ. 

ఈ అవార్డుపై వర్మ కామెంట్ చూసిన వాళ్ళు..  ఇలా కామెంట్ పెట్టకపోతే వర్మలో స్పెషాలిటీ ఏముంటుంది అనుకుంటున్నారు.ఐతే గతంలో అమితాబ్ తో మూడు సినిమాలు తీసాడు వర్మ. సర్కార్ తో అమితాబ్ కు మంచి పేరు తెచ్చిపెట్టాడు. కానీ ఆగ్ సినిమాతో అంతే చెడగొట్టాడు.తన సినిమా హిట్టైన ఫట్టైనా పట్టించుకోని వర్మ  కామెంట్లను మాత్రం  మీడియా, సామాజిక మాధ్యమాలు  బాగా ట్రోల్ చేస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: