నవ్వు ఒక వరం..నవ్వలేక పోవడం ఒక రోగం..అని అన్నారు పెద్దలు.  నవ్వు ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటారు.  అలాంటిది సినిమాల్లో నవ్వులు పూయించడం అంటే అంత సామాన్య విషయం కాదు.  తెలుగులో ఎంతో మంది హాస్యనటులు ఉన్నారు. రేలంగి,అంజిబాబు,రాజబాబు,పద్మనాభం అలనాటి హాస్యనటులు..వారి తరం తర్వాత బ్రహ్మానందం,సుధాకర్,అలీ లాంటి వారు తమ కామెడీతో దుమ్మురేపుతున్న సమయంలో ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో ‘సాంప్రదాయం’ సినిమాతో కమెడియన్ గా వెండి తెరకు పరియం అయ్యారు వేణు మాధవ్.  


మొదటి సినిమాతోనే తన కామెడీ మార్క్ చూపించిన వేణు మాదవ్ టాలీవుడ్ లో ఇరవై సంవత్సరాలు ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించారు.  స్వతహాగా మిమిక్రీ ఆర్టిస్ట్ కావడంతో ఎలాంటి పాత్రల్లో అయినా అలవోకగా నటిస్తూ..కామెడీ పండించాడు. venu COMEDIAN' target='_blank' title='click here to read more about venu COMEDIAN'>వేణుమాధవ్ హాస్యంతో థియేటర్లలో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వాల్సిందే. వెంకటేష్ హీరోగా నటించిన లక్ష్మీ సినిమాలో venu COMEDIAN' target='_blank' title='click here to read more about venu COMEDIAN'>వేణుమాధవ్, తెలంగాణ శకుంతల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

ఈ సినిమాకు ఏకంగా నందీ అవార్డు గెల్చుకున్నాడు వేణు మాధవ్.  నువ్వొచ్చినవేందక్కా అంటూ తెలంగాణ యాసలో venu COMEDIAN' target='_blank' title='click here to read more about venu COMEDIAN'>వేణుమాధవ్ పండించే కామెడీ పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుంది. లగ్జరీగా బతకాల్సిన వాడు అప్పులు చేసి చివరికి గొడ్ల సావిట్లో పేడ ఎత్తుకునే పరిస్థితి రావడం తనలా ఎవరూ అప్పులు చేసి తిప్పలు పడొద్దు అనే డైలాగ్ కడుపుబ్బా నవ్విస్తుంది. 


కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో హీరో సిద్దార్థ స్నేహితుడి పాత్రలో venu COMEDIAN' target='_blank' title='click here to read more about venu COMEDIAN'>వేణుమాధవ్ చేసే కామెడీ అందరినీ అలరిస్తుంది.  చింతకాయల రవి సినిమాలో venu COMEDIAN' target='_blank' title='click here to read more about venu COMEDIAN'>వేణుమాధవ్, బ్రహ్మానందంల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి.  venu COMEDIAN' target='_blank' title='click here to read more about venu COMEDIAN'>వేణుమాధవ్ అపరిచితుడులో vikram NEW' target='_blank' title='click here to read more about vikram NEW'>విక్రమ్ పోషించిన పాత్రకు తనదైన కామెడీని జోడిస్తూ చేసిన హాస్యం అంతా ఇంతా కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: