ఎన్టీఆర్ ,రామ్ చరణ్ హీరోలుగా  రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ .ఆర్.ఆర్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది  బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. అల్లూరి సీత రామరాజు గా రాంచరణ్ కనిపించగా అల్లూరి భార్య సీత పాత్రలో ఆలియా కనిపించనుంది. బాలీవుడ్ లో ఇప్పటికే తన అందం అభినయంతో అభిమానుల్ని సంపాదించుకున్న ఈ చిన్నది టాలీవుడ్ లో సైతం తన టాలెంట్ నిరూపించుకోవడనికి సిద్ధమైంది.

రాజమౌళి తో సినిమా చేయాలనీ ఆశపడ్డ ఆలియాకు  ఆర్ .ఆర్.ఆర్ మూవీతో ఆ కోరిక నెరవేరింది.ఇక బుధవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన వోగ్ బ్యూటీ అవార్డ్స్ 2019 కార్యక్రమంలో పాల్గొన్న అలియా  రెడ్ కార్పెట్ పై తన నడకతో అదరగొట్టింది.ఈ వేడుకల్లో ముంబై పరిశ్రమకు చెందిన పలువురు కథానాయికలు .. స్టార్ హీరోలు.. డిజైనర్లు సందడి చేశారు.  వోగ్ ఉత్తమ అందగత్తెగా అలియాబట్  పురస్కారాన్ని అందుకుంది.  దాంతో ఈ బ్యూటీ వోగ్ వేడుకకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వోగ్ మ్యాగజైన్ పదో ఎడిషన్ వార్షికోత్సవం సందర్భంగా ఈ అవార్డుల్ని అందించారు.  

 ఇక ఈ వేదికపై సారా అలీఖాన్ సహా రకుల్.. భూమి పెడ్నేకర్ వంటి భామలు కూడా రెడ్ కార్పెట్ నడకలతో అదరగొట్టారు.ఈ వేడుకలో సీనియర్ భామలు shilpa SHETTY' target='_blank' title='click here to read more'>శిల్పా శెట్టి.. తన సోదరి షమితా శెట్టి ఇంటర్వ్యూలతో పాటు రెడ్ కార్పెట్ నడకలతో దుమ్ము దులిపేశారు.ఇక ఇదే వేదిక వద్ద పూర్తిగా వైట్ అండ్ వైట్ డ్రెస్ లో తెలుగమ్మాయి శోభిత ధూళిపాల అసలు గుర్తు పట్టలేనంత కొత్తగా తనని తాను ఆవిష్కరించుకునే ప్రయత్నం చేసింది.

ఇక మిగిలింది సంజయ్ లీలా భన్సాలీ తో సినిమా చేయడమే. అయితే సంజయ్ లీలా భన్సాలీ సల్మాన్ ఖాన్,ఆలియా భట్ తో ఒక సినిమా ప్లాన్ చేసినప్ప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇక ఆర్.ఆర్.ఆర్ తో తెలుగులోకి అడుగు పెడుతున్న ఈ చిన్నది  ఇక్కడ కూడా రాణిస్తుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: