డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు ఆ తర్వాత నిర్మాతగా మారాడు. యంగ్ హీరోస్ దగ్గర్నుంచి స్టార్ హీరోస్ వరకు అందరితోను బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో నంబర్ వన్ ప్రొడ్యూసర్ కం డిస్ట్రిబ్యూటర్ గా చలామణి అవుతున్నారు. ఇక స్టార్ హీరోలెవరైనా, సినిమాలేవైనా ఈ సారి విజేత దిల్ రాజే. 2020 సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగు సినిమాల వెనుక నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు వుండటం విశేషం. సంక్రాంతికి విడుదలవుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో దిల్ రాజు భాగస్వామి. అంతేకాదు నైజాం, వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ కూడా. 

అలాగే స్టయిలిష్ స్టార్ బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'అల వైకుంఠపురములో' సినిమాకు నైజాం డిస్ట్రిబ్యూటర్. వైజాగ్ విషయం డిస్కర్షన్లలో వుందని తెలుస్తోంది. రజనీకాంత్ దర్బార్ సినిమాను తెలుగు రాష్ట్రాల హక్కులు తీసుకున్న ముగ్గురిలో దిల్ రాజు ఒకరు. ఇక మిగిలిన సినిమా కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా? ఈ సినిమా కూడా నైజాం, వైజాగ్ ఏరియాలో దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం ఎక్కువగా వుందని తాజా సమాచారం.

ఏ రకంగా చూసుకున్నా కూడా 2020 సంక్రాంతి సినిమాలన్నిటి వెనుక దిల్ రాజు వున్నారు. అందుకే ఆయన ఏరియాల్లో ఇప్పటి నుంచే థియేటర్ అగ్రిమెంట్లు జరిగిపోతున్నాయి. పొరపాటున వేరే వాళ్లు బిజినెస్ కు ఎంటర్ అయినా, దిల్ రాజును కాదని ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే సినిమా పేరు పెట్టకుండా, థియేటర్లు అగ్రిమెంట్ చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. తనకు ఏ సినిమాలు వుంటే వాటిని వేసుకుంటారు. అందువల్ల దిల్ రాజు ఆపరేట్ చేసే ఏరియాలకు సినిమాలను ఆయనకు తప్ప వేరే వాళ్ళకు ఇచ్చే ఛాన్స్ అసలు లేనే లేదు. మొత్తానికి డిస్ట్రిబ్యూషన్ రంగం మీద గట్టి పట్టే సంపాదించారు దిల్ రాజు. కొందరు ఇది స్ట్రాటజీ అంటున్నారు. కొందరు ఇది గుత్తాధిపత్యం అంటున్నారు. మరికొందరు ముందుకు వెళ్లి ఇదో మాఫియా అన్నంతగా విమర్శిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: