రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఇటీవల వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమా పర్వాలేదనిపించింది. ఇక అంతకముందు ఆయన నటించిన టాక్సీవాలా కూడా పర్వాలేదనిపించగా, నోటా మాత్రం ఫ్లాప్ చిత్రంగా మిగిలింది. అందుకే ఇకపై చేయబోయే సినిమాల విషయంలో విజయ్ దేవరకొండ, ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఆయన రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. అందులో ఒకటి వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా. కెఎస్ రామారావు సమర్పణలో క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కేఏ వల్లభ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

మంచి యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయి, విజయ ఫ్యాన్స్ కు మరియు ప్రేక్షకులకు సినిమాపై మంచి అంచనాలు ఏర్పరచింది. విజయ్ సరసన నలుగురు గ్లామరస్ హీరోయిన్స్ నటిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్, మొహం మీద రక్తంతో ఫుల్ హెయిర్ మరియు గడ్డంతో డిఫరెంట్ గా కనపడ్డారు. నిజానికి ఆ లుక్ రిలీజ్ అయినపుడు అందరూ అర్జున్ రెడ్డిని పోలి ఉంది అని కామెంట్ చేసినప్పటికీ, కథా పరంగా అర్జున్ రెడ్డికి ఈ సినిమాకు పోలిక లేదని అంటోంది సినిమా యూనిట్. 

ఇకపోతే నేడు హైదరాబాద్ లోని ఏఎస్ రావు నగర్ లోని కేఎల్ఎమ్ షాపింగ్ మాల్ ను ఓపెన్ చేసిన విజయ్ దేవరకొండ, తన లేటెస్ట్ లుక్ తో ఫాన్స్ కి షాక్ ఇచ్చాడు అనే చెప్పాలి. ఫుల్ హెయిర్ తో నూనూగు మీసాలు మరియు లైట్ గా గడ్డంతో ఉన్న విజయ్ ని ఆ షాప్ ఓపెనింగ్ సమయంలో చూసిన విజయ్ ఫ్యాన్స్ విపరీతంగా ఈలలు, గోలలతో హోరెత్తించారు. అయితే విజయ్ ఈ లేటెస్ట్ లుక్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న వరల్డ్ ఫేమస్ లవర్స్ కోసమే అని టాక్. మొత్తానికి ఫ్యాన్స్ కి తన న్యూ లుక్ తో మంచి కిక్ ఇచ్చిన విజయ్, రేపు సినిమా రిలీజ్ తరువాత ఎంత మేర సక్సెస్ తో కిక్ ఇస్తారో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: