సినిమాటోగ్రఫీ ,మ్యూజిక్ ,నటీనటుల పనితీరు సినిమాటోగ్రఫీ ,మ్యూజిక్ ,నటీనటుల పనితీరు సింపుల్ కథ ,స్లో స్క్రీన్ ప్లే ,ఫ్లాట్ నేరేషన్

గోదావరి జిల్లాలో కొనవరం అనే గ్రామంలో సూరి(రాజ్ తరుణ్) మరియు ఉమాదేవి(అవికా గొర్) మధ్యలో జరిగే కథనే "ఉయ్యాల జంపాలా". సూరి మరియు ఉమాదేవి బావామరదళ్ళు, చిన్నప్పటి నుండి కలిసి పెరిగినా వారి మధ్య ఎప్పుడు గిల్లికజ్జాలు జరుగుతూనే ఉంటుంది. సూరి , ఉమాదేవిని ఆటపట్టించడం, ఉమాదేవి దానికి ప్రతీకారంగా సూరిని ఆటపట్టించడం ఇలానే పెరుగుతారు. ఉమాదేవిని ఆట పట్టించడానికి సూరి సునీత ( పునర్నవి భూపాలం) ని ప్రేమించినట్టు నటిస్తాడు. దానికి ప్రతీకారంగా ఉమాదేవి పార్థు తో ప్రేమలో పడుతుంది. పార్థు ప్రేమలో ఉన్న ఉమాదేవి అనుకోని కొన్ని సంఘటనలు ఎదుర్కుంటుంది అదే సమయంలో ఉమాదేవిని సూరి రక్షిస్తాడు, అప్పటి నుండి సూరి ని ప్రేమించడం మొదలుపెడుతుంది ఉమాదేవి, చివరికి ఇద్దరు కలిసారా? సూరి ఉమాదేవి ప్రేమను అంగీకరించాడా? పార్థు ఏమయ్యాడు? అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం...

ఈ విభాగంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాజ్ తరుణ్ గురించి పల్లెటూరి అబ్బాయిలా గోదారి యాసలో అతని నటన చాలా ఆకట్టుకుంది. ఈ పాత్ర ఇతని కోసమే రచించారేమో అన్నట్టు నటించారు. అతనికి చాలా లఘు చిత్రాలలో ఉన్న అనుభవం ఇక్కడ బాగా ఉపయోగపడింది. మొదటి చిత్రంలోనే చాలా పరిపఖ్వతతో కూడిన నటన కనబరిచారు. అవిక గొర్ , ఈ చిత్రంలో ఉమాదేవి పాత్ర చాలా కీలకమయినది ఈ పాత్రలో అవికా అమాయకంగా బాగానే నటించినా స్వచ్చమయిన తెలుగు పల్లెటూరి అమ్మాయిలా కనబడటంలో విఫలం అయ్యింది, లిప్ సింక్ కుదరకపోవడంతో ఎమోషనల్ సన్నివేశాల దగ్గర తేలిపోయింది. పునర్నవి భూపాలం ఉన్న కాసేపు చాలా ఆకట్టుకుంది తన నటన చాలా బాగుంది. అనిత చౌదరి , పీల గంగాధర్ , రవి వర్మ ఉన్నంతలో పరవలేధనిపించారు. కిరీటి ఉన్నంతలో బాగా నటించారు .

ఈ చిత్రంలో చాలా సింపుల్ కథ ఉంటుంది బావమరదళ్ళు మధ్యన జరిగే చిన్న చిన్న అల్లర్లు వారి మధ్య బంధాల చుట్టూ అల్లెసుకున్నారు , కాస్త నువ్వే కావాలి చిత్రం పోలికలు ఉన్నా కాని ఈ చిత్రంలో ఉన్న ఫ్రెష్ ఫీల్ తో ఆలోచన రానివ్వలేదు. ఇక కథనం విషయానికి వస్తే ఇక్కడే దర్శకుడు కాస్త తడబడ్డాడు చెప్పాలనుకున్న పాయింట్ అయితే బాగుంది కాని దాని తీసుకెళ్ళిన విధానం మరీ ఫ్లాట్ గా ఉండటంతో ప్రేక్షకుడు ఎక్కువగా కథతో కనెక్ట్ కాలేడు. డైలాగ్స్ విషయానికి వస్తే గోదావరి యాసలో రచించిన డైలాగ్స్ బాగున్నాయి. సన్నీ ఎం అర్ అందించిన సంగీతం బాగుంది అతని నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. చిత్రం చిన్నదే కావడంతో మొదటి అర్ధ భాగంలో కొన్ని సన్నివేశాలను కత్తిరించాల్సి ఉన్నా ఎడిటర్ చేసేది ఎం లేకుండా పోయింది. విశ్వా అందించిన సినిమాటోగ్రఫీ చిత్రానికి హైలెట్, పల్లెటూరి అందాలను చాలా అందంగా చిత్రీకరించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

స్వచ్చమయిన పల్లెటూరి నేపధ్యంలో చాలా రోజుల తరువాత వచ్చిన ప్రేమకథ అందులోనూ బావామరదళ్ళు వారి మధ్య గిల్లికజ్జాలు ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగు తెర మీదకు చిత్రం వచ్చి చాలా రోజులు అయ్యింది. హీరో రాజ్ తరుణ్ లో తెలుగు హీరో లక్షణాలు ఏవి లేకపోయినా గోదారి కుర్రాడు అంటే ఇలానే ఉంటాడు అనిపించుకున్నాడు. అవిక గొర్ లిప్ సింక్ విషయంలో జాగ్రత్త తీసుకోవలసింది అంతే కాకుండా మహతి అందించిన డబ్బింగ్ సూట్ అవ్వలేదు అనిపించింది. దర్శకుడిగా విరించి వర్మ ఆకట్టుకున్నాడు, చిత్రం చాలా బాగుంది వెంటనే చూసేయాలి అని చెప్పలేము కాని ఖాళి ఉన్నప్పుడు ఒకసారయితే చూడగలం ..

Raj Tarun,Avika Gor,Virinchi Varma,Akkineni Nagarjuna,Sunny M.Rస్వచ్చమయిన పల్లెటూరి ప్రేమకథ

మరింత సమాచారం తెలుసుకోండి: