చెంగల వెంకట్ రావు..ఈ పేరు అంత ఈజీగా గుర్తు రావడం కష్టమే. కానీ నందమూరి బాలకృష్ణ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలిచిన సమరసింహారెడ్డి సినిమా పేరు చెప్తే మాత్రం ఈయన ఆ సినిమాకి నిర్మాత అన్న విషయం బాగానే గుర్తుకు వస్తుంది. రాజకీయ నాయకుడైన వెంకట్ రావు ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తం గర్వించదగ్గ సినిమాని తీసి అందరి అభిమాన్నాన్ని పొందాడు. ఆ ఉత్సాహంతోనే తారక్ హీరోగా నరసింహుడు సినిమాని నిర్మించాడు. ఈ సినిమా దెబ్బకి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మ హత్య చేసుకోబోయాడు. కారణం ఆ సినిమా ఆర్ధికంగా ఊబిలోకి లాగడమే. తారక్ తన రెమ్యునిరేషన్ తిరిగిచ్చినా కూడా రికవర్ కాలేకపోయాడు. అంతే అప్పటి నుంచి ఎమైపోయాడో ఎవరికి తెలీదు. సరిగ్గా అలాంటి సన్నివేశమే లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాష్కరణ్ అజ్ఞాతంలోకి వెళ్లేందుకు కారణమయ్యాయని తెలుస్తోంది. 2.0 లాంటి భారీ సినిమాని నిర్మించిన లైకా సంస్థ ఆర్థికంగా నష్టాలు పాలవ్వడంతో ఫైనాన్షియర్లు .. అప్పులు ఇచ్చిన వాళ్లంతా ఆయనపై ఒత్తిడి పెంచుతున్నారని గత కొంతకాలంగా ప్రచారమవుతోంది. ఇలాంటి కారణాల వల్లనే ఇప్పటికే సెట్స్ పై ఉన్న భారతీయుడు 2 రకరకాల ఇబ్బందులకు గురైందని కోలీవుడ్ మీడియా సమాచారం. అందుకే ఈ సినిమాని అప్పుడప్పుడు తెరకెక్కించాల్సిన పరిస్థితులు తలెత్తాయి.

ఇటీవలే రాజమండ్రి సెంట్రల్ జైల్లో భారతీయుడు 2 (ఇండియన్ 2) చిత్రీకరణ కొంత గ్యాప్ తర్వాత ప్రారంభమైన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మరోసారి ఈ సినిమాకి ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయమని సన్నిహిత వర్గాల సమాచారం. లైకా అధినేత సుభాస్కరణ్ 186 కోట్ల అప్పుల పై ఒత్తిడి టెన్షన్స్ అనుభవిస్తున్నారని.. వీటివల్లనే అతను అజ్ఞాతంలోకి వెళ్లారని ప్రచారమవుతోంది. రూ.186 కోట్లకు మోసం చేసినట్లు సుభాస్కరణ్ పై ఆరోపిస్తూ ఫైనాన్షియర్లు చెన్నై పోలీస్ కమీషనర్ ని కలిసి ఫిర్యాదు చేయనున్నారన్న వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

2.0 చిత్రాన్ని దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. కానీ సినిమా అనూహ్యంగా డిజాస్టరయింది.దీంతో చాలాచోట్ల డిస్ట్రిబ్యూటర్స్ కి భారీగా నష్టాలొచ్చాయి. కనీసం చైనాలో రిలీజ్ చేయడం వల్ల అయినా కాస్త రికవరీ అవుతుందని ఆశపడితే అక్కడ కూడా సినిమా ఫ్లాప్ గా మిగిలింది. దీంతో ఒత్తిళ్లు ఎదురయ్యాయని తెలుస్తోంది. దీనివల్ల ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రెండు సినిమాలకు బడ్జెట్ పరమైన సమస్యలు వస్తున్నాయి. రజనీకాంత్ కథానాయకుడిగా దర్బార్.. కమల్ హాసన్ కథానాయకుడిగా భారతీయుడు 2 (ఇండియన్-2) సినిమాలని లైకా సంస్థ ఏకకాలంలో నిర్మిస్తోంది. ఈ రెండు సినిమాలకి ఇబ్బంది తప్పదని లేటెస్ట్ న్యూస్. మరి లైకా అధినేత సుభాస్కరణ్ ఈ వార్తల్లో నిజం లేదని వివరణ ఇస్తారా? లేదా అన్నది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: