మెగాస్టార్ మెగా మూవీ సైరా ఇంకో వారంలో ప్రపంచ వ్యాప్తంగా అన్నీ ప్రధాన భాషల్లో రిలీజ్ కు సిద్దమవుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎంత ఊపందుకుందో అంతే ఊపు గాసిప్ప్స్ లోను కనిపిస్తోంది. ఈ సినిమా మీద ఉన్నట్లుండి రక రకాల వార్తలు వినిపించండం ప్రారంభమైంది. కోర్టులో వాదనలు జరిగాయని, ఇది బయోపిక్ కాదని, దర్శకుడు సురేంద్రరెడ్డి కోర్టులో వాగ్మూలం ఇచ్చారని, సెన్సారు అధికారులు ఇంకా సర్టిఫికెట్ ఇవ్వలేదని, బాలీవుడ్ సెన్సారు కాలేదని, ఇలా లెక్కలేనన్ని వార్తలు వస్తూనే ఉన్నాయి. 

మరోపక్క హిందీ భారీ సినిమా వార్ హైదరాబాద్, విశాఖ, విజయవాడ లాంటి ప్రాంతాల మల్టీ ఫ్లెక్స్ ల విషయంలో గట్టి పోటీ  ఇవ్వబోతోందని, తమ సినిమాకు కూడా సగం స్క్రీన్ లు కేటాయించాలని లేఖలు రాసిందని వార్తలు వినిపిస్తున్నాయి. వార్ సినిమా నిర్మించిన యష్ రాజ్ సంస్థ కూడా పెద్దదే. కాబట్టి వాళ్ళ మాటను మల్టీ ఫ్లెక్స్ లు అంత ఈజీగా పక్కనపడేయలేవు. దాంతో హాట్ హాట్ డిస్కషన్లు ప్రారంభమయ్యాయి. దాంతో ఇప్పటి వరకు హైదరాబాద్ లో కీలకమైన స్క్రీన్లకు ఆన్ లైన్ బుకింగ్ స్టార్ట్ కాలేదు.ఇదిలావుంటే సాయంత్రానికి సైరా తెలుగు వెర్షన్ కు సర్టిఫికెట్ వచ్చింది. దీన్ని బేస్ చేసకుని, హిందీ వెర్షన్ ను డబ్బింగ్ గా చూపించి, అక్కడ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. అందుకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తికావాలి. కానీ అవేవి ఇంకా కంప్లీటవలేదు. 

బాలీవుడ్ లో ఇంక నాలుగు రోజులు మాత్రమే సమయం వుంది. సెన్సారు సర్టిఫికెట్, థియేటర్ల కన్ ఫర్మేషన్ వస్తే తప్ప బుకింగ్స్ ఓపెన్ అయ్యో అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కోలీవుడ్ లో మాత్రం డబ్బింగ్ సెన్సారు పూర్తయిపోయిందని లేటెస్ట్ అప్‌డేట్. ఈ టెన్షన్లు పడుతూనే మరోపక్క నాన్ తెలుగు ప్రాంతాల్లో పబ్లిసిటీ వ్యవహారాలు చూడాలి. ఇంకోపక్క ఫైనల్ సౌండ్ చెకింగ్ కంప్లీట్వలేదు. అది పూర్తిచేస్తే కానీ క్యూబ్ లో లోడింగ్ అవుతుంది. లేదంటే స్క్రీనింగ్ ప్రాబ్లంస్ వస్తాయి. మొత్తంమీద సైరా టీం ఎంత ప్లాన్ డ్   గా ఉన్నా లాస్ట్ మినిట్ వరకు టెన్షన్స్ తప్పడంలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: