‘సైరా’ కు ఇప్పటి వరకు తమిళ ప్రేక్షకులలో చెప్పుకోతగ్గ మ్యానియా ఏర్పడని నేపధ్యంలో ఈ మూవీకి కోలీవుడ్ లో కూడ మ్యానియా క్రియేట్ చేయాలని చిరంజీవి చేస్తున్న ప్రయత్నాలు ఆదిలోనే మిస్ ఫైర్ అయ్యాయా అన్న సందేహాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు. దీనికి కారణం చిరంజీవి రజినీకాంత్ కమలహాసన్ లను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్.

‘సైరా’ ను ప్రమోట్ చేస్తూ చిరంజీవి ప్రముఖ తమిళ పత్రిక ‘ఆనంద వికటన్’ కు ఇంటర్వ్యూ ఇస్తూ రజినీకాంత్ కమలహాసన్ ల పొలిటికల్ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసాడు. రాజకీయాలు ఒక కప్పుతో టీ తాగినంత సులువు కాదనీ అందువల్ల ఇలాంటి రొంపిలోకి రజినీకాంత్ కమలహాసన్ లు రాకూడదని తన అభిప్రాయం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.

ఇప్పుడు ఈ కామెంట్స్ రజినీకాంత్ కమలహాసన్ అభిమానులలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికేకమలహాసన్ MNM పేరుతో ఒక పొలిటికల్ పార్టీని పెట్టి లక్షల సంఖ్యలో తమిళనాడు వ్యాప్తంగా తన పార్టీ కోసం సభ్యత్వాన్ని చేయించుకున్నాడు. 2021 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రజినీకాంత్ ఇప్పటికే తన అభిమానులతో అనేక సార్లు సమావేశాలు నిర్వహిస్తున్నాడు.

ఇలాంటి పరిస్థితులలో యధాలాపంగా సినిమా తారలు రాజకీయాలకు పనిరారు అంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ రజినీకాంత్ కమలహాసన్ వీరాభిమానులకు కోపాన్ని తెప్పించడమే కాకుండా ‘సైరా’ ద్వేషాన్ని పెంచే ఆస్కారం ఉంది. దీనితో రజినీ కమల్ అభిమానులు ‘సైరా’ పై నెగిటివ్ ప్రచారం చేసినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. అంతేకాదు మరికొంతమంది క్రిటిక్స్ అయితే చిరంజీవి చెపుతున్న ఈ సలహాలు పవన్ కళ్యాణ్ కు వర్తించవా అంటూ తమిళ మీడియా ప్రశ్నలు వేయడమే కాకుండా కేంద్రంలో మంత్రి పదవి చేసిన తరువాత సినిమా సెలెబ్రెటీలు రాజకీయాలకు పనికిరారు అన్న జ్ఞానోదయం చిరంజీవికి అయిందా అంటూ చురకలు అంటిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: