రకుల్ ప్రీత్ సింగ్ కి ఇపుడు ఎక్కడా అవకాశాలు లేవు. ఆమె చేసిన మూవీస్ వరసగా ఫెయిల్ కావడం, రాంగ్ చాయిస్, రాంగ్ డెసిషన్లతో రకుల్ బ్యాక్ బెంచ్ లోకి వెళ్ళిపోయింది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో దూసుకువచ్చిన ఈ అమ్మడు ఇపుడు ఏ ఎక్స్ ప్రెస్ లో ఉందో కూడా ఆమెకే తెలియడం లేదు. ఆమెకు హిట్లు ఇచ్చి, హైప్ ఇచ్చి స్టార్ ని చేసిన టాలీవుడ్ అయితే పట్టించుకోవడమే మానేసింది.


దీంతో రకుల్ రగిలిపోతోంది. తన ప్లేస్ ని ఆక్యుపై చేయడానికి కొత్త ఎత్తులతో ముందుకు వస్తోంది. అందుకోసం ఇన్స్టాగ్రాం ని  తెగ  వాడుకుంటోంది. తన హాట్ హాట్ అందాలను వండి వారుస్తూ రకుల్  చేస్తున్న సోయగాల  విన్యాసాలు కేక పుట్టిస్తున్నాయి. నాలో ఎక్కడా అందం తగ్గలేదు, నేను సత్తా చూపించగలనంటూ చాలెంజ్ చేస్తున్న రకుల్ ఆ వేడిలో అందాలను లెక్కలేనట్లుగా ఆరబోస్తోంది.


నిజానికి సినిమాల్లో సైతం  చూపించని అందాలను ఇలా ఇన్స్టాగ్రాం లో పరచేస్తూంటే సోషల్ మీడియా వెర్రెత్తి వూగిపోతోంది. రకుల్ ఇంకా రేసులోనే ఉందని కూడా కామెంట్స్ పడుతున్నాయి. రకుల్ రెచ్చిపోతున్న తీరుకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఒక్క చాన్స్ ఇస్తే మళ్ళీ రకుల్ తన పూర్వపు ప్లేస్ ని లాగేసుకుంటుందని కూడా ఆమె ఫ్యాన్స్ గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 


ఇదిలా ఉండగా రకుల్ ఇపుడు బాలీవుడ్ ని కూడా టార్గెట్ చేస్తోంది. ప్రస్తుతం  ఆమె నటించిన హిందీ చిత్రం మర్‌జావాన్‌ నవంబరులో విడుదల కానుంది. ఈ మూవీతో దశ తిరగడం ఖాయమని రకుల్ నమ్ముతోందట. ఇక రకుల్ లో సెక్సీ ఫిగర్ ని సూపర్ షేపులను బాలీవుడ్ ఇష్టపడితే మాత్రం ఆమె హిందీ ఫీల్డ్ లో మరింత కాలం తిరుగులేని స్టార్ డం ఎంజాయ్ చేస్తుందని కూడా ఫ్యాన్స్ ఆశపడుతోంది. రకుల్ కూడా అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ఒక్క దెబ్బతో ఊపేయాలనుకుంటోంది. మరి ఆమె రెచ్చగొట్టుడుకు పడే వారు ఉన్నారా.


మరింత సమాచారం తెలుసుకోండి: