ఒక గొప్ప నటుడు అర్ధంతరంగా లేకుండా పోతే ఎంత గందరగోళం నెలకొంటుందో ఇంతవరకూ ఎవరూ ఊహించి ఉండరు. శ్రీహరి మరణంతో అలాంటి గందరగోళమే నెలకొంది పరిశ్రమలో. అతడు చేయాల్సినవి ఎవరు చేస్తారు, అసలు అలాంటి వాళ్లు ఎవరున్నారు అంటూ వెతుకులాడుతున్నారు దర్శకులు. అయితే అందరికీ కనిపిస్తోన్న ఏకైక వ్యక్తి... సాయికుమార్. చనిపోయేనాటికి శ్రీహరి దాదాపు పది సినిమాల వరకూ ఒప్పుకుని ఉన్నారు. సడెన్ గా ఆయన చనిపోవడంతో ఆ పాత్రలకు దిక్కు లేకుండా పోయింది. అతడి ప్లేస్ ని రీప్లేస్ చేయడం అంత సులభం కాదు. ఆ పర్సనాలిటీ, ఆ డైలాగ్ డెలివరీ, హావభావాలు, బాడీ లాంగ్వేజ్... అన్నీ డిఫరెంట్. అంత చక్కగా చేయగలిగేవాళ్లు దొరకడం చాలా కష్టం. అందుకే దర్శకులంతా చాలా టెన్షన్ పడ్డారు. ఆ పాత్రలకు ఎవరిని ఎంచుకోవాలా అని నానా తంటాలు పడ్డారు. మిగిలినవారి సంగతేమో గానీ... శ్రీనువైట్ల మాత్రం సాయికుమార్ ని ఎంచుకున్నాడు. ఇక శ్రీహరి పాత్రను అతడు చేయాల్సిందే. ప్రస్తుతానికి వేరే ఆప్షన్ లేదు. సాయికుమార్ డబ్బింగ్ ఆర్టిస్టే కాదు... అద్భుతమైన నటుడు కూడా. ఆయన నటనా ప్రతిభ ప్రస్థానం వంటి సినిమాల్లో నిరూపితమైంది. శ్రీహరిలో ఉండే గంభీరత్వం సాయికుమార్ లో ఉంటుంది. అందుకే శ్రీను 'ఆగడు' కోసం ఆయనను తీసుకుని ఉంటాడు. అతడి సెలెక్షన్ కరెక్టే అని అందరూ అంటున్నారు. ప్రస్తుతం మహేశ్ ఇంకా నేనొక్కడినే పనుల్లోనే ఉండటంతో ఆగడు చిత్రం ఇంకా ముందుకు సాగడం లేదు. నేనొక్కడినే పూర్తవగానే ఏక షెడ్యూల్ లో పూర్తి చేసేందుకు ప్లాన్ చేశాడు శ్రీనువైట్ల. మరి ఈ సినిమాలో సాయి కుమార్ ని చూశాక అందరూ అతడికే ఓటు వేస్తారో లేక వేరే వాళ్ల కోసం వెతుకుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: