‘మన్మథుడు 2’ ఫ్లాప్ తో మూడు పరాజయాలు వరుసగా నాగార్జునను పలకరించడంతో నాగ్ పరిస్థితి అయోమయంగా ఉంది అని అంటున్నారు. ప్రస్తుతం నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 3’ మరో నెలలో పూర్తి కాబోతున్న నేపధ్యంలో నవంబర్ నుండి నాగార్జున పూర్తిగా ఖాళీ అయిపోతాడు. 

ఇలాంటి పరిస్థితులలో నాగార్జున ఈ సంవత్సరం లోపు ఎదో ఒక మంచి కథను ఎన్నుకుని తన సొంత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించి వచ్చే ఏడాది సమ్మర్ నుండి అయినా తన అదృష్టం మారుతుందేమో అన్న ఆలోచనల్లో ఉన్నట్లు టాక్. నాగార్జున మనసు పడుతున్న ఒక కథకు నాగచైతన్య నో చెపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

వాస్తవానికి నాగార్జున ఎంతో శ్రద్ధ పెట్టి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చేత వ్రాయించిన ‘బంగార్రాజు’ స్క్రిప్ట్ లో నాగచైతన్యకు ఏరికోరి ఒక ప్రత్యేకమైన పాత్రను క్రియేట్ చేయించాడు. అయితే ఆకథ తనకు మాత్రమే కాకుండా నాగార్జునకు కూడ ఏమాత్రం పనికిరాదు అంటూ చైతన్య స్పష్టంగా చెప్పడంతో నాగార్జున ఆలోచనలు ఈమూవీ విషయమై మారిపోయాయి అని అంటున్నారు. దీనితో ‘మహర్షి’ సినిమాకు కథ అందించిన ఒక యంగ్ రైటర్ తో నాగ్ చర్చలు జరుపుతున్నా ఆకథ విషయమై కూడ నాగ్ ఒక స్థిర నిర్ణయం తీసుకోలేక పోతున్నాడు అని అంటున్నారు. 

తన వయసు ఉన్న సీనియర్ హీరోలు చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తుంటే తనకు ఎటువంటి కథ సరిపోతుందో తనకే తెలియని ఒక అయోమయ స్థితిలో నాగార్జున ఉన్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో తన ఫ్లాప్ ల పరిస్థితుల నుండి గట్టెక్కించ గల శక్తి ఉన్న సీనియర్ డైరెక్టర్స్ వైపు చూస్తూ భారీ పారితోషికం ఆఫర్ చేస్తున్నా సీనియర్ డైరెక్టర్స్ అందరు వేరే టాప్ హీరోల వైపు చూడటం నాగ్ కు ఆశ్చర్యంగా మారింది అని టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: