హిందీలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ఇంగ్లీష్ , తెలుగు, తమిళ భాషల్లో కూడా ప్రసారం అవుతుంది. ముఖ్యంగా స్టోరీ , స్క్రీన్ ప్లే ఈ వెబ్ సిరీస్ విజయంలో కీలక పాత్రలు పోషిస్తున్నాయి. ఐఎండిబి లో ఈ వెబ్ సిరీస్ 8.9 రేటింగ్స్ ను రాబట్టుకుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో తెలుగు యువ హీరో సందీప్ కిషన్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. సందీప్ ఈ వెబ్ సిరీస్ లో మేజర్ విక్రమ్ గా కనిపించనున్నాడు. షోర్ ఇన్ ది సిటీ ఫేమ్ రాజ్ నిడిమోరు మరియు కృష్ణ డీకే డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాది వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్ గా చెప్పొకోవచ్చు. మరి వెబ్ సిరీస్ ప్రేమికులు ఇప్పటివరకు ఈ సిరీస్ ను చూడకుండా ఉండి ఉంటే ఈ సిరీస్ ఫై లుక్కేయండి.