తెలుగు సినిమా పాటల రచయితలలో సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఒక ప్రత్యేకమైన స్థానం. కొన్నివేల పాటలు వ్రాసిన ఈ పాటల రచయితకు కేంద్రప్రభుత్వం పద్మ పురస్కారంతో సత్కరించింది. ఇలాంటి పరిస్థితులలో తెలుగు సినిమా రంగంలో రచయితలు కవులు అంటే ఎంత చులకన అన్నభావం ఉంటుందో తెలియ చేసే ఒక సంఘటన ఏకంగా సిరివెన్నెలకు ఎదురు కావడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

‘నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు ఆ చూపులను అలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు’ అంటూ పాటలోని పాదాలలోని భావుకత వినగానే ఎవరికైనా వెంటనే సిరివెన్నెల గుర్తుకు వస్తారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో సంక్రాంతికి రాబోతున్న ‘అల వైకుంఠపురంలో’ సినిమాకు సంబంధించిన పాట ఇది. 

ఈ పాటను పూర్తిగా కాకుండా కొద్దిగా యూట్యూబ్ లో అప్ లోడ్ చేసి ‘అల వైకుంఠపురంలో’ ప్రమోషన్ కు శ్రీకారం చుట్టాడు. అంతేకాదు ఈ సినిమాకు పనిచేసిన విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ చేసిన వారి దగ్గర నుండి ఈ మూవీలో నటించిన నటీనటుల పేర్లు ఎడిటర్ ఆర్ట్ డైరక్టర్ మ్యూజిక్ డైరక్టర్ సినిమాటోగ్రాఫర్ ఇలా అందరి పేర్లు వేసారు. ఆఖరికి పాటతో సంబంధం లేని స్టంట్ మాస్టర్ పేరు కూడా వేసారు.

అయితే ఈ పాటను వ్రాసిన రచయిత పేరు మినహా. ఈ పాటలోని పదాల లాలిత్యం పట్టి సిరివెన్నెల శైలి కనిపిస్తుంది. లేదంటే ఈ పాటను వేరే రచయిత వ్రాసిసారు అని అనుకుందాము అంటే కనీసం ఆ రచయిత పేరు కూడ కనిపించదు. దీనితో ఒక రచయితకు వేరొక రచయిత దర్శకుడుగా మారి తీస్తున్న సినిమాలో పొరపాటున ఆ రచయిత పేరు మరిచిపోయారా లేదంటే రచయితల పట్ల నిర్లక్ష్యమా అన్న సందేహం ఎవరికైనా వస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: