టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకుడిగా టాలీవుడ్ చిత్ర సీమకు ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ రిలీజ్ అయి నేటికి 18 సంవత్సరాలు గడవడంతో, నేడు ఆయన తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో రెండవ సినిమాగా వచ్చిన ఆ సినిమాలో హీరోయిన్ గా గజాల నటించగా అశ్వినిదత్ దానిని నిర్మించడం జరిగింది. సరిగ్గా 18 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఆ సినిమా, అప్పట్లో మంచి విజయాన్ని అందుకుని రాజమౌళికి తొలి చిత్రంతోనే దర్శకుడిగా మంచి గుర్తింపుని తీసుకురావడంతో పాటు, 

ఎన్టీఆర్ కు మంచి మాస్ ఇమేజిని కట్టబెట్టింది. ఇక ఆ సినిమాకు ఎమ్ఎమ్ కీరవాణి అందించిన సంగీతం అప్పట్లో మంచి సక్సెస్ అయింది.  అందులోని 'కాస్త నన్ను నువ్వు', 'పడ్డానండి ప్రేమలో మరి', 'ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి' వంటి సాంగ్స్ అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి. కోట శ్రీనివాసరావు విలన్ గా నటించిన ఈ సినిమాలో తనికెళ్ళ భరణి ఒక ముఖ్య పాత్రలో నటించడం జరిగింది. అంతకముందు దూరదర్శన్ లో ఒక సీరియల్ కు దర్శకత్వం వహించిన రాజమౌళికి తొలిసారి దర్శకుడిగా చేయమని ధైర్యం చెప్పి ముందుకు నడిపిన వ్యక్తి దర్శకేంద్రులు శ్రీ కె రాఘవేంద్రరావు గారు. 

ఇక ఆ నాటి తొలి చిత్ర మధుర  స్మృతులను గుర్తుచేసుకుంటూ రాజమౌళి కాసేపటి క్రితం ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసారు. నా తొలి చిత్రం  స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకు18 ఏళ్ళు నిండాయి, సరిగ్గా ఇదే సమయంలో మేము రామోజీ ఫిలిం సిటీ లో అప్పట్లో షూటింగ్ జరిపిన సన్నివేశం ఇప్పటికీ గుర్తుంది, అప్పటి నా తొలి సినిమా హీరో ఎన్టీఆర్ నేడు ఎంతో మారారు, నటుడిగా ఎన్నో విషయాలు నేర్చుకుంటూ, ఎంతో గొప్పస్థాయికి వెళ్ళాడు అంటూ రాజమౌళి పోస్ట్ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం ఆయన చేసిన ఆ పోస్ట్, పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: