బొమ్మరిల్లు సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన భాస్కర్, తొలి సినిమానే అప్పట్లో సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో దర్శకుడిగా విపరీతమైన పేరు మరియు క్రేజ్ ని సంపాదించడం జరిగింది. సిద్దార్ధ, జెనీలియాల కాంబినేషన్లో దిల్ రాజు నిర్మించిన ఆ సినిమాకు అప్పట్లో యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా బ్రహ్మరధం పట్టారు. నిజానికి ఆ సినిమా ఎప్పటికీ మన తెలుగు వారి మదిలో నిలిచిపోయే గొప్ప సినిమాల్లో ఒకటి అని చెప్తుంటారు ఎందరో ప్రేక్షకులు. అయితే ఆ సినిమా తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా భాస్కర్ తెరకెక్కించిన పరుగు సినిమా కూడా మంచి విజయాన్ని ఆదుకోవడం జరిగింది. 

ఇకపోతే దాని తరువాత అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగాబ్రదర్ నాగబాబు నిర్మాతగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా తెరకెక్కిన ఆరెంజ్ సినిమా అప్పట్లో అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచి భాస్కర్ కెరీర్ కు పెద్ద బ్రేక్ వేసింది. అనంతరం రామ్, కృతి కర్బంధల కలయికలో భాస్కర్ తెరకెక్కించిన ఒంగోలు గిత్త సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర చతికిలపడడంతో భాస్కర్ కెరీర్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ఇక అప్పటినుండి ఇప్పటివరకు ఒక్క తెలుగు సినిమా కూడా చేయని భాస్కర్, ఇటీవల అక్కినేని అఖిల్ హీరోగా కొత్త సినిమాని ప్రారంభించారు. 

గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన గోల్డెన్ లెగ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా కూడా బొమ్మరిల్లు తరహాలోనే మంచి యూత్ ఫుల్ గా ఉంటూ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మరియు ఎమోషన్స్ కలగలిపిన కథగా ఉండనుందట. ఇందులో అఖిల్ ఒక స్టూడెంట్ గా నటిస్తున్నాడని సమాచారం. అయితే గతంలో బొమ్మరిల్లు సినిమాతో మంచి హిట్ ని అందుకున్న భాస్కర్, ఈ సినిమాతో మళ్ళి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అవుతుందో తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ వరకు ఓపిక పట్టాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: