మెగాస్టార్ గా కోట్లాదిమంది అభిమానులను పొందిన చిరంజీవి ఇప్పటి వరకు 150 సినిమాలలో నటించినా అతడు ప్రయోగాలు చేసిన ప్రతి సినిమా ఫెయిల్ అయిన పరిస్థితులలో ఆ సెంటిమెంట్ ‘సైరా’ కు శాపంగా మారుతుందా? అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు కూడ వారు తెరపైకి తీసుకు వస్తున్నారు.

చిరంజీవి జాతీయస్థాయిలో అవార్డు ఆశించి ప్రముఖ దర్శకుడు బాల చందర్ దర్శకత్వంలో ‘రుద్రవీణ’ సినిమాను సొంతంగా నిర్మిస్తే ఆ సినిమాకు నేషనల్ అవార్డు రాలేదు సరికదా భారీనష్టాలు వచ్చాయి. ఆతరువాత విపరీతంగా పెరిగిపోతున్న తన మాస్ హీరో ఇమేజ్ ని కొద్దిగా తగ్గించుకోవాలని జంధ్యాల దర్శకత్వంలో ‘చంటబ్బాయి’ గా వస్తే ఆమూవీ కూడ నిరాశ పరిచింది. 

విశ్వనాథ్  దర్శకత్వంలో ‘ఆపద్భాందవుడు' కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో ‘స్నేహంకోసం’  లాంటి సినిమాలను చేసినా పేరు వచ్చింది కాని విజయాలు దక్కలేదు. ఇలా చిరంజీవి తన రొటీన్ పాత్రలకు భిన్నంగా ఎప్పుడు ప్రయత్నించినా అపజయాలు పలకరిస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఒక విప్లవ కారుడి పాత్రను మొదటిసారిగా ‘సైరా’ మూవీలో చాల ఉద్వేగభరితంగా చిరంజీవి నటిస్తున్నాడు. 

చరిత్రకు సంబంధించిన సినిమాలు ఎంత బాగా ఉన్నప్పటికీ కలక్షన్స్ విషయంలో ఆ మూవీలు రికార్డులు క్రియేట్ చేసిన సందర్భాలు లేవు. దీనితో ప్రస్తుత తరం అభిరుచులు మారిపోయిన నేపధ్యంలో చిరంజీవి ‘సైరా’ కోసం ఎంత కష్టపడినా అతడు కోరుకున్న రికార్డులను ప్రేక్షకులు అందిస్తారా అన్న విషయమై చిరంజీవికి ఒక నెగిటివ్ సెంటిమెంట్ వెంటాడుతోంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ‘సైరా’ మ్యానియా తెలుగు రాష్ట్రాలలో బాగా కనిపిస్తున్నా ఈ మూవీ మ్యానియా బాలీవుడ్ లో చాల తక్కువగా కనిపిస్తోంది. దీనికితోడు బాలీవుడ్ మీడియా ‘సైరా’ పట్ల అంత సుముఖంగా లేదు. ఇలాంటి పరిస్థుతులలో చిరంజీవి నెగిటివ్ సెంటిమెంట్ ను ఎలా ఫేస్ చేస్తాడో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: