మెహరీన్ అందరిలా కాదు. నా రూటే వేరు. నేను కథలు వినను. సినిమా చేయాలని దర్సకుడు, నిర్మాతలు ఎవరైనా వచ్చి అడిగితే వెంటనే ఒప్పుకుంటాను. కాల్షీట్లు ఇచ్చేస్తాను అంటోంది మెహరీన్. వరుస విజయాలతో మెహరీన్ తెలుగు సినీ పరిశ్రమలో దూసుకుపోతోంది. అయితే ఎఫ్..2 సినిమా తరువాత ఆమె ఆచితూచి అడుగులు వేస్తోందన్న ప్రచారం బాగానే సాగుతోంది.


ఎలాంటి పాత్రలు చేయడానికైనా తాను సిద్ధమేనని అంటోంది కథానాయిక మెహరీన్. 'పాత్ర ఎలాంటిది అనేది నేను చూడను. ఏ తరహా పాత్ర అయినా సరే చేయడానికి నేను రెడీ. బోల్డ్ పాత్రలైనా చేస్తాను. అయితే, ఆ పాత్రలో కాస్త విషయం వుండాలి, దానికి కథలో ప్రాధాన్యత వుండాలి' అని చెప్పింది మెహరీన్. 


హీరోయిన్‌కు వరుస విజయాలు వస్తే అమ్మడు స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదగడం చాలా ఈజీ. ప్రస్తుతం తెలుగులో మెహ్రీన్‌కు ఆ అవకాశం ఉందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' సినిమాతో ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేసిన ఈ ముద్దుగుమ్మ రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఏడాదిన్నర కాలం పట్టింది. కొద్దిరోజుల క్రితం 'మహానుభావుడు'తో తెలుగుతో వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకున్న ఈ అందాల భామ ఆ వెంటనే 'రాజా ది గ్రేట్' సినిమాతో హ్యాట్రిక్ కొట్టింది. ఎఫ్‌2లో మంచి పాత్ర‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. హీరోయిన్ ఎంత హాట్‌గా నటిస్తే అంత డిమాండ్, క్రేజ్ ఉంటుందని గమనించిన మెహ్రీన్ ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకుందని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ అప్ కమింగ్ బ్యూటీ ఫిజిక్‌పై దృష్టి పెట్టి ఎక్స్‌పోజింగ్ డోసు పెంచితే.. టాప్ హీరోయిన్ రేంజ్‌కు ఎదగడం అంత కష్టమేమీ కాదనే ప్రచారం కూడా సాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: