కేంద్రంలో అధికారంలో ఉండి... రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీలోకి కొందరు సీనియర్ నేతలు ఇప్పటికే  జంప్ చేస్తున్నారు. అదే బాటలో  కాంగ్రేస్ చైర్ సభ్యురాలు విజయశాంతీ ఉన్నట్టు తెలుస్తుంది. లేడి అమితాబ్ రాములమ్మ సినీ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలోనూ దూకుడు ప్రదర్శిస్తూ ఉంటుంది.  ఇప్పుడు పరీస్థితులు చూస్తుంటే  తెలంగాణా కాంగ్రేస్ చైర్ సభ్యురాలు విజయశాంతీ పార్టీ మారే అవకాశం వుందనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, టీపీసీసీసీ చైర్‌పర్సన్ విజయశాంతి అలియాస్ రాములమ్మ త్వరలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ, ఢిల్లీకి చెందిన కమలనాథులు రాములమ్మతో భేటీ అయ్యి.. పార్టీలో చేరికపై చర్చించారని వినికిడి.

ఇందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన ఆమె.. దసరా పర్వదినంనాడు ఢిల్లీ వేదికగా కాషాయ కండువా కప్పుకోవాలని యోచిస్తున్నారని సమాచారం. స్టార్‌డమ్ ఉన్న రాములమ్మ ఒకప్పటి తమ పార్టీ నేత కావడం  ఆమెను పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నట్లున్నాయి. రానున్న హుజూర్ నగర్ ఉపఎన్నికల్లోనూ, అలాగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె సేవలు వినియోగించుకోవాలనే  బీజేపీ నేతలు భావిస్తున్నారు.

మరోవైపు టీఆర్ఎస్‌కు ధీటుగా వెళ్లాలంటే బీజేపీతోనే సాధ్యమన్న భావనలో విజయశాంతి కూడా ఉన్నారని సమచారం. బీజేపీలో చేరికపై త్వరలోనే ఓ నిర్ణయానికి రానున్నట్టు ఆమె సన్నిహిత వర్గాలు  తెలియజేస్తున్నాయి.దీంతో బీజేపీలో చేరికకు ఆమె సిద్ధంగానే ఉన్నారనేది స్పష్టమవుతుంది. ఓవైపు కాంగ్రెస్ డౌన్ అవుతున్న సంకేతాలు కనిపిస్తుంటే..... తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవడానికి బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించించి.

తమకు పట్టులేని పలు నియోజకవర్గాల్లో  టీడీపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ నుంచి నాయకులను చేర్చుకునేందుకు సాక్షాత్తూ పార్టీ జాతీయ నాయకత్వం పర్యవేక్షణలో సంప్రదింపులు జరుగుతున్నాయి.
 బీజేపీ జాతీయ, రాష్ట్రపార్టీ ముఖ్యనేతలు స్వయంగా ఆయా పార్టీలకు చెందిన ప్రముఖులతో అంతర్గత చర్చలు జరుపుతున్నారు 


    మరింత సమాచారం తెలుసుకోండి: