నాలుగు వారాల క్రితం భారీ అంచనాలతో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సాహో సినిమా విడుదలైంది. సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా బాలీవుడ్ లో మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకు బాలీవుడ్ లో 150 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో బాలీవుడ్ లో ఘన విజయాలు అందుకున్న ప్రభాస్ సాహో సినిమాతో బాలీవుడ్ లో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
భారీ అంచనాలతో విడుదలైన బాహుబలి, బాహుబలి 2, సాహో సినిమాలు హిట్ కావటం సైరా సినిమాకు చాలా హెల్ప్ అవుతుంది. తెలుగు సినిమాలు హిందీలో ఘన విజయం సాధిస్తూ ఉండటంతో బాలీవుడ్ ప్రేక్షకులు టాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సైరా టీజర్, ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి. ప్రభాస్ తెలుగు సినిమా మార్కెట్ బాలీవుడ్ లో పెంచటంతో చిరంజీవికి సాయం చేశాడు.
 
ప్రముఖ బాలీవుడ్ హీరో, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ సైరా బాలీవుడ్ హక్కులను దక్కించుకున్నాడు. అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో నటించటం కూడా సైరా సినిమాకు హెల్ప్ కానుంది. అక్టోబర్ 2వ తేదీన తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సైరా నరసింహారెడ్డి సినిమా విడుదల కాబోతుంది. దాదాపు 270 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించాడు. 
 
కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ ప్రాంతానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో ఈ సినిమా తెరకెక్కింది. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, సుదీప్, అనుష్క ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందిస్తూ ఉండటం విశేషం. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: