టాలీవుడ్ సినిమా పరిశ్రమకు 2003 లో శ్రీరామ్, ఆర్తి చాబ్రియా హీరో హీరోయిన్లుగా వచ్చిన ఒకరికి ఒకరు సినిమాతో కథా రచయితగా సినిమా ప్రయాణాన్ని మొదలెట్టిన కోన వెంకట్, ఇప్పటివరకు అనేక సినిమాలకు కథలు అందించడం జరిగింది. కొన్నేళ్ల క్రితం ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల సినిమాలకు రైటర్ గా పని చేసిన కోన, ఆ తరువాత బయటకు వచ్చేసి విడిగా ఇతర సినిమాలకు కథలు రాస్తున్నారు. ఆయన కథల సంపుటి నుండి వెలువడిన సినిమాల్లో చాలావరకు విజయవంతమయినవే ఉన్నాయి. టాలీవుడ్ లోని ప్రముఖ రచయితల్లో ఒకరుగా వున్న కోన వెంకట్, 

ఇటీవల కోన ఫిలిం కార్పొరేషన్ అనే పేరుతో నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేసి సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు పలు సినిమాలు నిర్మించిన ఆయన, ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారితో కలిసి తన కోన ఫిలిం కార్పొరేషన్ సంస్థపై అనుష్క శెట్టితో నిశ్శబ్దం అనే సినిమాను నిర్మిస్తున్న కోన వెంకట్ పై నేడు షాకింగ్ గా చీటింగ్ కేసు పెట్టబడింది. వివరాల్లోకి వెళితే, తనకు ఒక మంచి సినిమా కథ ఇస్తాను అని చెప్పి రూ.13.50 లక్షల రూపాయల డబ్బును తన నుండి మోసపూరిత మాటలతో నమ్మించి కోన వెంకట్ తీసుకున్నారని జెమిని ఎఫ్ఎక్స్ డైరెక్టర్ ప్రసాద్ అనే వ్యక్తి, 

నేడు జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ని ఫైల్ చేయడం జరిగింది. ఇటీవల కథ కోసం అడుగుదామని ఆయన ఇంటికి వెళ్తే, పలు విధాలుగా తనను దూషించచడంతో పాటు తనను బెదిరింపులకు కోన గురిచేశారని, అందువలన తనకు న్యాయం చేయాలని కోరుతూ నేడు పోలీసులను ఆశ్రయించినట్లు ప్రసాద్ చెప్పినట్లు సమాచారం. అయితే కోన వెంకట్ పై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ విషయమై పూర్తి విచారణ చేపట్టి నిజానిజాలు తేలుస్తాం అని అంటున్నారు. కాగా ఈ వార్త ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: