ఒక మెజీషియన్ గా పేరు తెచ్చుకున్న సుధీర్..ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా కమెడియన్ బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తున్న సుధీర్ సినిమా అవకాశాలతో సినిమాలలోకి కూడా ఎంటర్ అయ్యాడు. అలా తన పాపులార్టీ ని పెంచుకుంటూ వచ్చాడు. 



జబర్దస్త్ కమెడియన్ ఇండస్ట్రీకి చూపిస్తే వారి టాలెంట్ సినిమా అవకాశాలను అందించింది. చాలా మంది కమెడియన్లు గా సినిమాలలోకి ఎంటర్ అయితే.. మరి కొందరు మాత్రం హీరో లుగా ఎంటర్ అయ్యారు. అలా సినిమాలలోకి ఎంటర్ అయిన వారిలో.. ముందుగా ధనా ధన్ ధనరాజ్ ,  షకలక శంకర్  , చమ్మక్ చంద్ర  ఉండగా ఇప్పుడు ఆ వరుసలో సుధీర్ చేరాడు..




సుధీర్ ప్రస్తుతం హీరో గా చేస్తున్న సినిమా సాఫ్ట్  వెర్  సుధీర్.. ఈ సినిమాలో ధన్య బాలకృష్ణ హీరోయిన్ గా చేస్తుంది. ఇకపోతే ఈ సినిమాలోని ఓ పాటకు ప్రముఖ గాయకుడు గద్దర్ కూడా నటిస్తున్నారు .పోసాని మురళి కృష్ణ , ఇంద్రజ వంటి ప్రముఖ నటులు ఇందులో నటిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్ర టీజర్ ను ఈరోజు రిలీజ్ చేసారు. 




అందుతున్న సమాచారం ప్రకారం.. టీజర్ రిలీజ్ అయినా కొద్దీ గంటలకే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐరన్ మ్యాన్ కి అక్కలాగా ఉన్నావ్ నువ్వు అడాపిల్లవా అంటూ సాగిన టీజర్ అందరిని  బాగా ఫిదా చేసింది ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఆ సినిమాకు హైప్ తీసుకొస్తే మరి కొన్ని మాత్రం రెండు తెలంగాణ రాష్ట్రాలకు గొడవలు పెడుతున్నాయని కామెంట్లు అందుకుంటున్నాయి..సుధీర్ అదృష్టం ఏ మాత్రం ఉందొ   మరి ఈ  సినిమాలో చూడాల్సిందే.. 


మరింత సమాచారం తెలుసుకోండి: