పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ఈ పేరు చెప్పినా, విన్నా జనాలకి మామూలుగా పూనకాలు రావు. అంతగా క్రేజ్ ని సంపాదించుకున్నారు. సినిమాల పరంగా, రాజకీయ పరంగా జనాలలో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. అయితే రాజకీయాలలో బిజీ అవడంతో సినిమాలకు ఇక గుడ్ బాయ్ చెప్పారు పవన్. కానీ జనాలు మాత్రం ఆయన సినిమాలలో నటిస్తేనే బావుంటుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.  ఇక దర్శక, నిర్మాతలైతే పవర్ స్టార్ ఎప్పుడు ఉం.. అంటే అప్పుడు సినిమా స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు.

పవన్‌క ళ్యాణ్‌ మళ్లీ నటిస్తాడనే వార్తలు బాగా వినిపించిన ప్రతిసారీ వచ్చి నేను ఇక సినిమాలలో నటించేది లేదు అంటూ పవన్‌కళ్యాణ్‌ ప్రకటిస్తూనే ఉన్నాడు. అయితే పవర్ స్టార్ ఎంత గట్టిగా ఖండించినా కానీ మళ్లీ పవన్‌ నటిస్తాడనే వార్తలు సోషల్ మీడియాలో పుడుతూనే వున్నాయి. ఇందుకు పవన్‌ కళ్యాణే కారణమని చెప్పాలి. ఎందుకంటే పవన్‌ కళ్యాణ్‌ ఇక నటించనని ప్రకటనలిస్తూనే మళ్ళీ నిర్మాతలు, దర్శకులతో తరచుగా చర్చలు జరుపుతూనే వున్నారు. అది సినిమాల విషయంలోనా లేక వ్యక్తిగత విషయాలకొసం వాళ్ళతో చర్చలు జరుపున్నారా అన్నది క్లారిటీ లేదు. ఆ క్లారిటి ఉంటే ఈ వార్తలు రావు కదా..! 
పవన్‌ కళ్యాణ్‌ మళ్లీ నటించాలి అని ఎవరైనా తన ముందు అంటే నవ్వుతో అందుకు సిద్ధమేనన్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. దీన్ని బట్టే ఈ వార్తలు రావడానికి ఎక్కువగా ఆస్కారం కనిపిస్తోంది. ఇటీవల రాజకీయ వ్యవహారాలలో కంటే సినిమా వేదికల మీదే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇప్పటికీ పవన్‌కళ్యాణ్‌ని ఎక్కువగా కలుస్తున్నది సినిమా వాళ్లే కావడం విశేషం. 

ఎమ్మెల్యేగా కూడా గెలవకపోవడంతో రాజకీయ పరంగా పవన్‌కి పనులేమి లేనట్టే. అందుకే సినిమాల పట్ల ఆసక్తి చూపిస్తున్నాడని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. ఒకవేళ సినిమాలకు ఒకే చెప్తే పవన్‌కి రాజకీయాల పట్ల నిబద్ధత లేదంటు మాట్లాడుకుంటారేమోనన్న చిన్న డైలమాలోను ఉన్నారు. ఒకవేళ నటించే ఉద్దేశం వుంటే కనీసం కామెంట్స్ అన్నా తగ్గుతాయి కదా అని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. ఒకరకంగా చూస్తే ఇదీ నిజమే అనిపిస్తుంది. మరి త్వరలో పవర్ స్టార్ ఏదో ఒక క్లారిటి స్పష్ఠంగా ఇస్తే బావుంటుంది కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: