భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మించడానికి నిర్మాతలకు.. దర్శకులకు చాలా ధైర్యం కావాలి. షూటింగ్ మొదలయ్యాక అనుకోని కారణాల వల్ల నిర్మాణం ఎక్కువ సమయం తీసుకుంటుంది గనక నిర్మాతలతో పాటు దర్శకుడికి కూడా ఆ ప్రెజర్ ఎక్కువే ఉంటుందన్న విషయం రాజమౌళి లాంటి అగ్ర దర్శకులను చూస్తే అర్థమవుతుంది. గతంలో అయితే సినిమాకు యావరేజ్.. సక్సస్ అనే మాటలుండేవి కాబట్టి దర్శకుడి కెరీర్ కు ఎఫెక్టేమీ ఉండదు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రిలీజ్ అయిన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తేనే సూపర్ హిట్ అవుతుంది.. లేదా ఫ్లాప్ అని ఫిక్సవ్వాల్సిందే. హిట్ అయితే క్యూ కడతారు. కానీ ఫ్లాప్ అయితే మాత్రం ఆ దర్శకుడిని పట్టించుకునేవారు ఉండరు. ప్రస్తుతం 'సైరా' దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా రిలీజ్ ముందు ఉండే ప్రెజర్ లో ఉన్నారట.

మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం చాలా తక్కువమందికి వస్తుందన్న సంగతి తెలిసిందే. అందుకే చిరుకు ఎలాగైన ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే తపనతో సురేందర్ పని చేశారట. అయితే ఈ సినిమా ఫ్రీడమ్ ఫైటర్ బ్యాగ్డ్రా లో తెరకెక్కడం.. 270 కోట్ల పై బడ్జెట్ పెట్టడంతో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న విషయంలో ప్రెజర్ ఫీలవుతున్నారట. సినిమా ప్రోమోస్ బావున్నా ప్రేక్షకులు తీర్పు ఇచ్చేది మాత్రం అక్టోబర్ 2 నే. ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించారు కాబట్టి 'బాహుబలి','సాహో' సినిమాలతో పోలికలు సహజంగా ఉంటున్నాయి. 

ప్రభాస్ 'సాహో' కు ప్రోమోస్ తో ఊహించని క్రేజ్ వచ్చింది. కానీ సినిమాకు మాత్రం మొదటి షో నుంచే నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రభాస్ క్రేజ్ పీక్స్ లో ఉండడంతో ఆ నెగెటివ్ టాక్ ను తట్టుకుని మరీ ఆ మాత్రం కలెక్షన్స్ ను రాబట్టగలిగింది. ఒకవేళ 'సైరా' కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే సరే కానీ అలా కాకుండా రివర్స్ లో జరిగితే 'సైరా'కు బాక్స్ ఆఫీస్ దగ్గర కష్టమేననే మాట గట్టిగా వినిపిస్తోంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: