స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న  మూడో చిత్రం అల .. వైకుంఠపురములో..   ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకానుంది. ఇక ఈ చిత్రం నుండి నిన్న విడుదలైన  'సామజవరగమన' సాంగ్  యూనానిమస్ పాజిటివ్  రెస్పాన్స్ ను తెచ్చుకుని  ప్రస్తుతం యూ ట్యూబ్ లో  ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఇప్పటివరకు ఈ సాంగ్  6మిలియన్ల ఫై చిలుకు వ్యూస్ ను రాబట్టుకుంది. 



 ఇక  ఈచిత్రంలో  బన్నీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడు.  త్రివిక్రమ్  దాదాపు  తన ప్రతి సినిమాకు టైటిల్ దగ్గర్నుండి  పాత్రల పేర్ల  వరకు  డిఫ్రెంట్ గా ఉండేలా చూసుకుంటాడు. ఈచిత్రంలో బన్నీ పనిచేసే  కంపెనీ పేరు  కూడా డిఫ్రెంట్ గా ఉంది.  ఇంతకీ ఆ కంపెనీ  పేరు ఏంటంటే  'ప్యాక్ యువర్ బ్యాగ్స్'.   నిన్న ఈ సినిమాలోని బన్నీ స్టిల్స్ ను కూడా విడుదలచేయగా   అందులో ఒక స్టిల్ ను పరిశీలించి చూస్తే  ఈ కంపెనీ పేరు క్లియర్  గా తెలుస్తుంది. 



ఇదిలా ఉంటే ఒక్క సాంగ్ తో సినిమా ఫై అంచనాలు  తారాస్థాయికి చేరుకున్నాయి.   పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో బన్నీ కి జోడిగా పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా  సీనియర్ నటి టబు , జయరాం , మురళి శర్మ , నవదీప్ , సుశాంత్ ,రాహుల్ రామకృష్ణ , నివేత పేతురాజ్  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: