డైరెక్టర్స్ నటించడం కొత్త ఏం కాదు. అప్పట్లో దాసరి నారాయణరావు గారు చాలా సినిమాలలో నటించారు. కె.విశ్వనాధ్ గారు అనేక చిత్రాలలో నటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దది. S v కృష్ణ రెడ్డి తన స్వీయ దర్శకత్వంలో తానే హీరోగా చేసారు. అలాగే జంధ్యాల గారు,  కోడి రామకృష్ణ గారు కూడా అక్కడక్కడా మెరిశారు.

ఇక ప్రస్తుతం ఉన్న డైరెక్టర్స్ లో V V వినాయక్ గారు ఠాగూర్ లో మరియు ఇప్పుడు దిల్ రాజు నిర్మాణంలో ఏకంగా హీరోగా నటిస్తున్నారు. రాజమౌళి కూడా సై మూవీలో అలాగే మజ్ను మూవీలో తమ నటనను పరిచయం చేసుకున్నారు. అలాగే రవి బాబు, అవసరాల శ్రీనివాస్ ఇద్దరు ఒకపక్క డైరెక్టర్ గా మరో పక్క యాక్టర్స్ గా రాణిస్తున్నారు. పూరి జగన్నాథ్ తన సినిమాలో ఏదో ఒక సన్నివేశం లో వచ్చి వెళ్తుంటారు. ఏం మాయ చేసావే లో కూడా పూరి కనిపించారు. ఇక బోయపాటి తన సీన్ తోనే సినిమా స్టార్ట్ చేస్తారు. క్రిష్ కూడా మహానటి లో నటించి అందరిని ఆశ్చర్య పరిచారు. సురేందర్ రెడ్డి, మారుతి, హరీష్ శంకర్ కూడా నటించారు.

సుకుమార్ కూడా ఇటీవల విడుదల అయినా గ్యాంగ్ లీడర్, గద్దల కొండ గణేష్ లో కనిపించారు. తరుణ్ భాస్కర్ కూడా విజయ్ దేవరకొండ నిర్మాణంలో హీరో గా చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. A R మురగదాస్, K S రవి కుమార్ తమిళ డెరెక్టర్స్ కూడా ఉన్నారు. లేడి డైరెక్టర్స్ కూడా ఉన్నారు ఇందులో అప్పట్లో విజయ నిర్మల, నందిని రెడ్డి కూడా నటించారు. ఏదేమయిన డైరెక్టర్స్ హీరో లతో  పోటీ కీ సై అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: