మెగాస్టార్ చిరంజీవి న‌టించిన పీరియాడిక‌ల్ మూవీ సైరా న‌ర‌సింహారెడ్డి. రూ.280 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సైరా సినిమా థియేట‌ర్ల‌లోకి దిగేందుకు మూరో మూడు రోజుల టైం మాత్ర‌మే మిగిలి ఉంది. ఇప్ప‌టికే ఈ సినిమాకు రు. 200 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌ర‌గ‌గా... మ‌రో రూ.130 కోట్ల వ‌ర‌కు శాటిలైట్‌, డిజిట‌ల్ బిజినెస్ జ‌రిగింద‌ని అంటున్నారు. ఇక సైరా ఫ‌స్ట్ రివ్యూ అప్పుడే వ‌చ్చేసింది. తెలుగు సినిమాల విడుదలకు ముందే రివ్యూలు ఇచ్చే దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు 'సైరా' చిత్రానికి ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు.


ఈ రివ్యూ చూస్తే సైరా సినిమా ఇప్పుడే చూసేయాల‌న్నంత ఆతృత‌తో ఉంది. పైగా ఈ సినిమాకు ఉమైర్ ఏకంగా నాలుగు స్టార్లు ఇచ్చాడు. సైరాలో ఎమోష‌న‌ల్ రైడ్‌తో యాక్ష‌న్ సీన్లు రోమాలు నిక్క‌పొడుచుకునేలా ఉన్నాయ‌ని ఉమైర్ తెలిపాడు. పీరియాడిక్ సీన్లు సూప‌ర్బ్ అంటున్నారు. బాహుబ‌లిలా ఇది క‌ల్పిత క‌థ కాద‌ని... ఇది రియ‌ల్ స్టోరీతో తెర‌కెక్కిన స్టోరీ కావడం గొప్ప విష‌య‌మ‌న్న ఉమైర్‌... ఇది పాత రికార్డుల‌ను స్మాష్ చేస్తుంద‌ని అంటున్నారు.


అయితే ఉమైర్ విష‌యంలో గ‌తంలో చాలా సార్లు సీన్లు రివ‌ర్స్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి', మహేష్ బాబు 'స్పైడర్', అల్లు అర్జున్ 'నాపేరు సూర్య' వంటి అట్టర్ ఫ్లాప్ చిత్రాలకు ఈయన టాప్ రేటింగ్ ఇచ్చారు. రీసెంట్‌గా 'సాహో' చిత్రానికి సైతం మైండ్ బ్లోయింగ్ అంటూ రివ్యూ ఇచ్చారు. అయితే, ఆ సినిమా అనుకున్న స్థాయిలో పోలేదు. అంతెందుకు బాహుబ‌లి సినిమా సైతం ప్లాప్ రేటింగ్‌. ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌రి ఈ సారి సైరా విష‌యంలో ఉమైర్ రివ్యూ ఏం అవుతుందో ?  చూడాలి.


కొణిదెల కంపెనీ ప్రొడ‌క్ష‌న్‌పై రు. 270 కోట్ల భారీ బడ్జెట్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైరా సినిమా నిర్మించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెలుగు తో బాటుగా హిందీ, మళయాళ, తమిళ, కన్నడ భాషల్లో ఈ భారీ చారిత్రాత్మక చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ వర్క్ లు ఊపందుకున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: