ఆర్ఎక్స్ 100 సినిమాతో మొదటి హిట్ కతాలో వేసుకున్న హీరో కార్తికేయ యూత్ ఫుల్ లో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ఇటీవల తాజాగా విలన్ పాత్రల పోషించిన, నాని గ్యాంగ్ లీడర్ చిత్రంలో చక్కని నటనను ప్రదర్శించాడు. ఇది ఇలా ఉండగా 90ఎంఎల్ అనే మరో సరి కొత్త మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందు వస్తున్నాడు.

ఇటీవల విడుదైలైన భిన్నమైన పోస్టర్స్ లో కార్తికేయకి హీరోయిన్ ఒడిలో పడుకుంటే ఆమె పాలపీకతో మందు తాగించడం ఆసక్తికరంగా మారింది.ఇలాంటి ట్రెండీ పోస్టర్స్ తో చిత్రంపై హైప్ పెంచేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు.కార్తికేయ క్రియేటివ్ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా వహిస్తున్న ఈ చిత్రాన్ని శేఖర్ రెడ్డి ఎర్రా తెరకెక్కిస్తున్నారు.యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అలీ, పోసాని,రావు రమేష్, అజయ్, రవి కిషన్ ఇతర  కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఇక కార్తికేయ కెరీర్లో ‘ఆర్‌ఎక్స్‌ 100’తో సెన్సేషన్‌ క్రియేట్‌చేసిన కార్తికేయ..‘హిప్పీ’చిత్రంతో పెద్దగా హిట్ కోటలేకపోయాడు. అయితే మళ్లీ ‘గుణ 369’ అంటూ ప్రయత్నించినా.. సరైన విజయాన్ని తాను దకించుకోలేకపోయాడు.ఈసారి ఎలాగైనా విజయం కొట్టాలని.. మరో ప్రాజెక్ట్‌ను ఒప్పుకున్నాడు.ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు.

పాలసీసాలో కూడా మందును పోసినట్టు డిజైన్‌చేసి రిలీజ్‌ చేసిన పోస్టర్‌ ఆసక్తిని రేకిత్తించగా..ఫస్ట్‌ లుక్‌,టైటిల్‌ను రిలీజ్‌ చేశారు. టైటిల్‌ చూస్తుంటే మరో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు అర్ధమవుతుంది. 90 ఎంఎల్ చిత్రంలో ఓవియా ప్రధాన పాత్రలో హీరోనిగా నటిస్తుంది.హిందీ బిగ్ బాస్ తో ఎంతో మంది ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఓవియా. హిందీ బిగ్ బాస్ తర్వాత ఓవియా చేస్తున్న తొలి చిత్రం కావడంతో చాల మంచి అంచనాలు ఉన్నాయి. కానీ 90 ఎంఎల్ ట్రైలర్ విడుదల కాగానే ఓవియా అభిమానులు సైతం అశ్యపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: