పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాల్లో జల్సా హిట్ కాగా అత్తారింటికి దారేది  ఇండస్ట్రీ హిట్ అయింది. 2018 జనవరి నెలలో విడుదలైన అజ్ఞాతవాసి సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. కథ, కథనంలోని లోపాలు ఈ సినిమా ఫ్లాప్ ఫలితాన్ని అందుకోవటానికి కారణమయ్యాయి. ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలకే పరిమితమయ్యాడు. 
 
అజ్ఞాతవాసి సినిమాను హిందీ భాషలో డబ్బింగ్ చేసి ఆ సినిమాకు ఎవడు 3 అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ అందుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిందీ డబ్బింగ్ సినిమాల్లో 100 మిలియన్ల వ్యూస్ అందుకున్న తొలి సినిమాగా అజ్ఞాతవాసి రికార్డు సొంతం చేసుకుంది. బాలీవుడ్ ప్రేక్షకులకు సాధారణంగానే టాలీవుడ్ సినిమాలంటే ఆసక్తి ఎక్కువ. తెలుగులో ఫ్లాప్ ఫలితాన్ని అందుకున్నప్పటికీ యూట్యూబ్ లో మాత్రం ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకోవటం విశేషం. 
 
గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వస్తాడని వార్తలు వినిపిస్తున్నప్పటికీ పవన్ ఆ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నాడు. మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న సైరా నరసింహారెడ్డి చిత్రానికి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. సినిమా ప్రారంభం అయ్యే సమయంలో మరియు సినిమా ముగిసే సమయంలో పవన్ వాయిస్ ఓవర్ ఉంటుందని సమాచారం అందుతుంది. 
 
2019 ఏపీ ఎన్నికలలో జనసేన పార్టీ కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే సీటు గెలిచింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా కార్యకర్తలు, నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేయటానికి కృషి చేస్తున్నాడని సమాచారం అందుతోంది. 2024 ఎన్నికలలోపు పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: