తెలుగు రియాల్టీ షోలో ప్రస్తుతం తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తున్న షో బిగ్ బాస్ రియాల్టీ షో. 10 వారాలు ముగించుకుని తాజాగా 11వ వారం నుంచి అడుగుపెట్టడంతో హౌస్ లో వాతావరణం మొత్తం క్షణక్షణానికి మారిపోతున్నాయి. హౌస్ లో ఉన్న మెంబర్స్ వేస్తున్న స్ట్రాటజీ లు...బిగ్ బాస్ ముందు పనిచేయటం లేదు. ఇంటి లోని సభ్యులకు బయట ఏం జరుగుతుంది ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు ఎవరు ఇంట్లోకి వస్తున్నారు అసలు ఎలిమినేషన్ జరుగుతుందా లేదా అన్న విధంగా బిగ్ బాస్ లోన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అదేవిధంగా బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు షో చూస్తున్న ప్రేక్షకులను ఎంతగానో అలరించే విధంగా ఇంటి సభ్యుల చేత ఆడిస్తున్నారు. మొత్తంమీద సీజన్ త్రీ బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులకు అభిమానులకు ఎంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచుతున్నాయి అని చాలామంది బిగ్ బాస్ సీజన్ 3 గురించి మాట్లాడుతూ కామెంట్ చేస్తున్నారు.


ఇదిలా ఉండగా ఆదివారం జరిగిన ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో శ్రీముఖి బాబా భాస్కర్, రవి కృష్ణ మిగిలి ఉన్నారు. శనివారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన వరుణ్ సందేశ్ సేవ్ అయ్యారు. అయితే చివరగా మిగిలిన ముగ్గురు సభ్యులు శ్రీముఖి, బాబా భాస్కర్, రవి కృష్ణ ల మధ్య ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ప్రక్రియ చాలా ఉత్కంఠభరితంగా ప్రేక్షకులను మైమరిపించే విధంగా జరగటం విశేషం. ముందుగా ఈ ప్రక్రియలో శ్రీముఖి సేవ్ అయినట్లు యాంకర్ నాగార్జున ప్రకటించడంతో హౌస్ నుండి బాబా భాస్కర్- రవికృష్ణ ల మధ్య ఎవరు ఎలిమినేట్ అవుతారో అని ఇంటి సభ్యుల మధ్య టెన్షన్ నెలకొంది. ఈ లోపు యాంకర్ నాగార్జున రవికృష్ణ ఎలిమినేట్ అవుతున్నట్టు ప్రకటించడంతో బాబా భాస్కర్ మాస్టర్ సేవ్ అవడం జరిగింది.


అయితే హరికృష్ణ చాలా తీవ్రమైన భావోద్వేగంతో బిగ్ బాస్ హౌస్ విడిచారు. అయితే బిగ్ బాస్ హౌస్ విడిచాక యాంకర్ నాగార్జునతో వేదిక పంచుకున్న రవికృష్ణ బిగ్ బాస్ హౌస్ ఇంటి సభ్యుల గురించి అనేక విషయాలు చెబుతూ సలహాలు ఇస్తూ వెళ్తూ వెళ్తూ పునర్నవి పై బిగ్ బాంబ్ వేశాడు. అదేమిటంటే వారం మొత్తం ఇంటిలో ఉన్న హౌస్ మేట్ సభ్యుల బట్టలు ఉతకడం. దీంతో రవి కృష్ణ పునర్నవి పై వేసిన బిగ్ బాంబ్ గురించి సోషల్ మీడియాలో బిగ్ బాస్ అభిమానులు నెటిజన్లు...రవి కృష్ణ ఇంటి నుండి వెళ్తూ వెళ్తూ పునర్నవి పొగరు దించేశాడు అని కామెంట్లు పెడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: