ఆదివారం రాత్రి బిగ్ బాస్ షో కొంచెం రసవత్తరంగా జరిగింది. ఈ వారం నామినేషన్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన వరుణ్, శ్రీముఖి, బాబా భాస్కర్, రవిక్రిష్ణలు ఉండడంతో వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది పెద్ద మిస్టరీగా మారింది. కానీ అనూహ్యంగా రవిక్రిష్ణ ఇంటి నుండి వెళ్ళిపోయాడు. అయితే ఈ నలుగురిలీ రవిక్రిష్ణనే వీక్ కంటెస్టెంట్ కావడం వల్ల అతను ఇంటి నుండి వెళ్ళక తప్పలేదు. బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్స్ ద్వారా బాగా దగ్గరైన నటుడు రవి కృష్ణ.


ఆయనకు ఒక తరగతి వర్గం యొక్క మద్దతు ఉండటంతో పాటు, టైటిల్ సాధిస్తాడనే నమ్మకం కూడా ఏర్పడింది. ఐతే అనూహ్యంగా నిన్న ఆయన బిగ్ బాస్ హౌస్ కి బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. రవిక్రిష్ణ బయటకి వెళ్లడానికి కారణాలెలా ఉన్నా, చివరి వరకు ఉండాల్సిన కంటెస్టెంట్ అని అందరూ అనుకున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న వారిలో ఎవరెవరు చివరివరకు నిలబడతారనేది ప్రశ్నగా మారింది.


ప్రస్తుతం ఉన్న వారిలో శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ లు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. కొత్తగా శివజ్యోతి కూడా వచ్చి చేరింది. రీ ఎంట్రీ ఇచ్చిన ఆలీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినప్పటికీ ఆల్రెడీ ఒకసారి ఎలిమినేట్ అయ్యాడు గనక ఆయన మీద బయట ప్రభావాలు చాలా ఉన్నాయి. తద్వార ఆయన ఆటలో చాలా మార్పులొచ్చినట్లు తెలుస్తుంది. అదీగాక ఒకసారి వెళ్ళి వచ్చినవాడు కాబట్టి ఆలీ చివరి వరకు ఉన్నా కూడా టైటిల్ వచ్చే ఛాన్సెస్ కనబడట్లేదు.


ఇక పునర్నవి, రాహుల్ వితికాలలో వితికా చివరి వరకు నిబడగలుగుతుంది. ఎందుకంటే వరుణ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కావడం వల్ల ఆయన వల్ల ఆమె కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కనిపించట్లేదు. ఇక పునర్నవి ఎప్పుడు నామినేషన్ లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఆమె ఎప్పుడు నామినేషన్ లోకి అప్పుడు ఎలిమినేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. రాహుల్, వరుణ్, శ్రీముఖి, బాబా భాస్కర్, వితికా మాత్రమే చివరి వరకు ఉంటారని తెలుస్తుంది.






మరింత సమాచారం తెలుసుకోండి: