హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన ఛార్మి ప్రస్తుతం నిర్మాతగా మారి పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తుంది. వీరిద్దరు పూరి కనెక్ట్స్ బ్యానర్ లో మొదటగా "జ్యోతిలక్ష్మీ" అనే సినిమాతో నిర్మాతగా మారారు. ఈ సినిమాలో ఛార్మి హీరోయిన్ గా నటించింది.అయితే ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రోగ్, పైసా వసూల్, మెహబూబా లాంటి చిత్రాలు వచ్చాయి. కానీ ఏదీ అనుకున్నంత విజయం సాధించలేదు.


దీంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ఆ సమయంలో రామ్ పోతినేని హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమాని తెరకెక్కించాడు పూరి. ఈ సినిమా బాక్సాఫీసును ఊపేసిందనే చెప్పాలి. ఎన్నో రోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న పూరికి ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని చేకూర్చింది. నిర్మాతగా ఛార్మికి మొదటి విజయాన్ని అందించింది. అయితే తమకు వచ్చిన లాభంలో కొంత భాగాన్నిఎన్నో రోజులుగా ఇండస్ట్రీలో ఉంటూ అవస్థలు పడుతున్న దర్శకులకు పంచి ఆర్థిక సాయం చేశారు.


ఛార్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నటుడు ఉత్తేజ్ అతిధిగా విచ్చేశాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ముందు ఆమె పడ్డ కష్టాల గురించి మాట్లాడింది. అలాగే నటుడు ఉత్తేజ్ ఛార్మి గురించి మాట్లాడుతూ ఎవ్వరికీ తెలియని విషయం చెప్పాడు. పంజాబీ అమ్మాయి అయిన ఛార్మి తెలుగులో హీరోయిన్ గా నటించడమే కాదు, తెలుగు సినిమాల్లోని హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పిందట.


2007లో కృష్ణ వంశీ తెరకెక్కించిన ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చందమామ చిత్రంలో కాజల్ పాత్రకు ఆమె డబ్బింగ్ చెప్పారట.పంజాబీ కుటుంబానికి చెందిన ఛార్మి తెలుగు సినిమాకి డబ్బింగ్ చెప్పడం విశేషమనే చెప్పాలి. ఛార్మి నిర్మాతగా ప్రస్తుతం ఆకాష్ పూరి హీరోగా రొమాంటిక్ చిత్రం, మరియు విజయ్ దేవరకొండ హీరోగా మరో చిత్రాన్ని నిర్మిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: