మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యుంగ్ టైగర్  ఎన్టీఆర్ తొలిసారిగా కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్  చిత్రం `ఆర్ ఆర్ ఆర్`.అబ్బురపరిచే నేపథ్యంతో రాజమౌళి   తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై  ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో  అంచనాలు వున్నాయి.మొట్టమొదటి సారి ఇద్దరు స్టార్ హీరోలు హిస్టారికల్ నేపథ్యం ఉన్న కథతో అభినులకు కనువిందు చేయబోతున్నారు .ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్  నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి తిరుగుబాటు బావుటాని ఎగురవేసిన విప్లవ యోధుడు కొమరం భీంగా నటిస్తున్నాడు ,ఇక  మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు.

చిత్రీకరణ దశలోనే  ఈ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన  సీన్ లీకయింది. ఇలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కే సినిమాల సీన్లు లీక్ అవడం మామూలే అయ్యుండి   గతంలో రామ్ చరణ్ నటించిన `రంగస్థలం` చిత్రంలోని ఆది పాత్ర చనిపోయే సన్నివేశంతో పాటు ఆ తరువాత జరిగే భావోద్వేగ సన్నివేశాల్ని చిరు బయటపెట్టిన విషయం తెలిసిందే.   ఇప్పుడు కూడా  ఆర్ ఆర్ ఆర్ సంబంధించి చెర్రీ చేసే సీన్ ఒకటి బయట పెట్టారు మెగాస్టార్ .

తాజాగా  `సైరా` ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూకి విచ్చేసిన  చిరంజీవి `ఆర్ ఆర్ ఆర్` కీ సీన్ సీక్రెట్ ని బయటపెట్టేశారు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చూడటానికి సతీ సమేతంగా వెళ్లిన చిరుకి  తనయుడు రామ్ చరణ్  శ్రమిస్తున్న  విధానం చూసి వారి గుండెలు బరువెక్కిపోయాయట. ఆ సమయంలో అల్లూరి  బ్రిటిష్ వారికీ  వ్యతిరేకంగా  పోరాటంలో భాగం కావడానికి ముందు తనకి తాను సంసిద్ధం చేసుకుంటాడు అల్లూరి.

ఈ సీన్  సంబంధించిన కొన్ని ముఖమైన   సన్నివేశాల్ని మన జక్కన్న  రామ్ చరణ్ పై చిత్రీకరిస్తున్నాడట.ఈ విషయాన్ని స్వయంగా  చిరు బయట పెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.చిరు రివీల్ చేసిన ఈ సీన్ తో ప్రేక్షకుల్లో ఈ సినిమా పై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. మెగాస్టార్ ఏ లీకిచ్చినా అది సినిమాకి కలిసొచ్చేదేనని అర్థమవడంతో రాజమౌళి కూడా ఈ విషయంలో సైలెంట్ అయినట్టు తెలుస్తుంది . ఇక వచ్చే ఏడాది  జూలైలో ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ చేయడానికి అంత సిద్ధం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: