బాలీవుడ్ రాణిగా పేరొందిన కంగనా తన నటనా సామర్థ్యంతో పాటు నిర్భయంగా మాట్లాడటంలో, ఎంతటివారినైనా ధిక్కరించి మాట్లాడటంలో నిష్ణాతురాలు అన్న సంగతి తెలిసిందే.  మీడియాకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడం మొదలుకుని, తోటి నటీనటులతో గొడవ పడటం వరకు ఎందులోనూ వెనక్కు తగ్గదు. తన తోటి బాలీవుడ్ నటుడు  హృతిక్‌ రోషన్‌కి  కంగనా రనౌత్‌ మధ్య ఉన్న వివాదం గురించి అందరికి తెలిసిందే. 


కొన్నాళ్ల పాటు సన్నిహితంగా వీరిద్దరూ ఏమైందో ఏమో గాని ఒకరికొకరు గొడవపడటం మొదలెట్టారు. హృతిక్‌ తనని  మోసం చేశాడంటూ కంగన ఆమధ్య విమర్శలు చేసింది.  అప్పట్నుంచి సందర్భం దొరికినప్పుడల్లా హృతిక్‌పై తన కోపాన్ని ప్రదర్శించటం, అతని పై కామెంట్స్ చేయడం మాములు అయిపోయింది. ఈ మధ  ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనకు హృతిక్‌ గురించి ఓ ప్రశ్న ఎదురైంది.


 దానికి ఆమె చెప్పిన సమాధానం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యుంది.  ‘‘మీరు ఓ రోజు ఉదయం లేవగానే హృతిక్‌లా మారిపోతే ఏం చేస్తారు?’’ అడగగా, దానికి ఆమె బదులిస్తూ ఇలా సమాధానం ఇచ్చింది.‘నేను హృతిక్‌లా మారిపోతే కంగనకు ఫోన్‌ చేసి క్షమాపణలు  అడుగుతాను" అంటూ అందరిని షాక్ కి గురిచేసింది.  మన మధ్య జరిగిందేదో జరిగింది.కానీ  ఈ విషయంలో నేను చేసిన పనికి మన్నించమని వేడుకుంటున్న అని అడుగుతాను" అని  చెప్పింది.

వెంటనే మరి  ‘‘సల్మాన్‌ ఖాన్‌లా మారిపోతే ఏం చేస్తారు’’ అని అడగగా దానికి బదులు గా  ‘‘మీడియా వారి చెవులు మెలేస్తాను" అని అన్నది. ఆ  వెంటనే నవ్వుతు  ఆ పని సల్మాన్‌ చేస్తే మీడియాకు ఓకే. కానీ నేను చేస్తే ఓకే కాదు కదా’’ అని అన్నది కంగన. మరి ఈ వ్యాఖ్యలకు హృతిక్ ఏమని బదులిస్తాడో చూడాలి. లేదా కామ్ గా కంగనా మనసు తెలుసుకొని క్షమాపణలు చెప్తాడేమో చూడాలి.


    మరింత సమాచారం తెలుసుకోండి: