ఇక సైరా విడుదల సమయం వస్తుంది.సైరా ప్రమోషన్స్ కోసం చిరంజీవి,చరణ్  చాలా సమయం కేటాయించారు. ఇక పాన్ ఇండియా సినిమాలకు హార్ట్ లాంటిది బాలీవుడ్ మార్కెట్.  చాలా  స్టామినా ఉన్న మార్కెట్ అది. అందుకే అక్కడ అమితాబ్‌తో కలిసి ఒక ఇంటర్వ్యూ‌లో పాల్గొన్నారు చిరంజీవి. ఇక వివరాల్లోకి వెళ్తే అయితే ఆ ఇంటర్వ్యూ  రొటీన్‌గా కాకుండా చాలా సరదా సరదాగా కొనసాగింది. చిరు చాలా ఫార్మల్‌గా మాట్లాడుతున్నా కూడా అమితాబ్ మాత్రం తన స్పాంటేనిటీతో, తన మార్క్ చమక్కులతో  సంభాషణ కొనసాగింది.

బిగ్ బి మాత్రం ఇంటర్వ్యూ‌లో సైరా అనేది చిరంజీవి సినిమా మాత్రమే కాదు ఆ సినిమాలో మొత్తం చిరు ఫామిలీ  మొత్తం ఇన్వాల్వ్ అయ్యిందని తెలిపారు. 'చిరంజీవి తనయుడు చరణ్, అలాగే చిరు  కూతురు సుస్మిత కూడా సినిమాకోసం చాల కాస్త పడ్డారు. ఆమె టాలెంట్ చూసి ఆమెకి కాంప్లిమెంట్స్ ఇచ్చాను' అని తెలిపారు బిగ్ బి  అమితాబ్. ఆ సందర్భంలో చిరంజీవి సైరా సినిమాకి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తుచేశారు.చిరు ఇంటర్వ్యూ‌లో 'సైరా కోసం నా తమ్ముడు పవన్ కళ్యాణ్ వాయిస్ఓవర్  ఇచ్చాడు... సినిమా స్టార్టింగ్‌లో ఎండింగ్‌లో కూడా వాయిస్ వస్తుంది అని  చెప్పగానే అమితాబ్ కూడా  పవన్ గురించి మాట్లాడం మొదలు పెట్టారు.

ఇక ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చిరంజీవి తో తన పరిచయాన్ని చెప్తున క్రమంలో అమితాబ్ అప్రయత్నంగానే చిరంజీవి‌ పై ఒక కౌంటర్ వేశారు బిగ్ బి  అమితాబ్. అమితాబ్ ఇలా  'నేను చిరంజీవికి చాలా సలహాలు ఇచ్చాను, కానీ అవేమీ ఆయన పాటించరు. రాజీకీయాల్లోకి వెళ్లొద్దు అని చూపిన కూడా వినలేదు...కొంతకాలం తర్వాత చిరు రాజకీయాల్లో నుండి తిరిగివచ్చేసా అన్నాడు, కానీ తరువాత వాళ్ళ తమ్ముడు వెళ్తున్న అంటే కూడా  అతనికి కూడా  సలహాలు చెప్పాను...పవన్ కూడా  వినలేదు...అతను రాజీకీయాల పట్ల చాలా ఆసక్తి కలిగిఉంటాడు'' అని నవ్వేసారు  బిగ్ బి. దానికి చిరు స్పందిస్తూ ''నేను రాజకీయల్లోకి వెళ్లినందుకు నేను చాలా  రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, కానీ పవన్ కళ్యాణ్ కి మాత్రం  అర్హత కలిగి ఉన్నాడు'' అంటూ  పవన్ ని  సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు చిరు.

ఎప్పుడు చిరు, పవన్ కలవకపోయినా మెగా ఫ్యామిలీలో కలతలు అని రాసేసేవాళ్లకు ఆ ఛాన్స్ లేకుండా చేసాడు చిరంజీవి. సైరాకి వాయిస్ చెప్పినందుకు నేషనల్ మీడియాలో సైతం అతన్ని హైలైట్ చేసి, పవర్ స్టార్ అంటే తనకు ఎంత ప్రేమ అనేది చెప్పకనే చెప్పాడు. సైరా సినిమాని బాలీవుడ్‌కి చేరువ చెయ్యాలి అనే ఆ టీమ్ ప్రయత్నం ఈ ఒక ఒక్క ఇంటర్వ్యూ‌తో ఫుల్‌ఫిల్ అయ్యింది. అలుపులేకుండా సైరా టీమ్ చేస్తున్న ప్రమోషన్స్‌తో అక్టోబర్ 2న బాక్సాఫీస్ దగ్గర సైరా సంచలనాలు మామూలుగా ఉండవు అనే క్లారిటీ అయితే వచ్చేసింది. అది ఏ రేంజ్ చరిత్ర సృష్టిస్తుంది అనేది మాత్రం చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: